Share News

Robert Vadra: గురుగ్రామ్ ల్యాండ్ డీల్‌లో రాబర్ట్ వాద్రాకు రూ.58 కోట్ల ముడుపులు.. కోర్టుకు తెలిపిన ఈడీ..

ABN , Publish Date - Aug 10 , 2025 | 07:15 AM

కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు ఆర్థిక నేరం కేసులో ఉచ్చు బిగుస్తోంది. గురుగ్రామ్‌లో జరిగిన ఓ వివాదాస్పద ల్యాండ్ డీల్ ద్వారా వాద్రాకు రూ.58 కోట్ల రూపాయల ముడుపులు అందినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆరోపణలు చేస్తోంది.

Robert Vadra: గురుగ్రామ్ ల్యాండ్ డీల్‌లో రాబర్ట్ వాద్రాకు రూ.58 కోట్ల ముడుపులు.. కోర్టుకు తెలిపిన ఈడీ..
Robert Vadra

కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) భర్త రాబర్ట్ వాద్రాకు ఆర్థిక నేరం కేసులో ఉచ్చు బిగుస్తోంది. గురుగ్రామ్‌లో జరిగిన ఓ వివాదాస్పద ల్యాండ్ డీల్ (Corrupt land deal in Gurugram) ద్వారా వాద్రా (Robert Vadra)కు రూ.58 కోట్ల రూపాయల ముడుపులు అందినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఆరోపణలు చేస్తోంది. ఢిల్లీలోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టులో ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈడీ ఫిర్యాదును పరిశీలించిన కోర్టు, దీనిపై విచారణను ఆగస్టు 28వ తేదీకి వాయిదా వేస్తూ వాద్రాకు నోటీసులు జారీ చేసింది.


రాబర్ట్ వాద్రాకు చెందిన స్కై లైట్ హాస్పిటాలిటీ సంస్థ గురుగ్రామ్‌లోని షికోహ్‌పూర్‌లో ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 3.5 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. ఈ భూమిని రూ. 7.50 కోట్లకు కొన్నట్లు సేల్ డీడ్‌లో చూపించారు. అయితే ఆ ప్రాంతంలో ఒక్కో ఎకరా రూ.15 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. పైగా చెక్కు ద్వారా చెల్లింపులు జరిపినట్టు పత్రాలు చూపించారు. అయితే వాద్రా చెక్కు అసలు ఇప్పటివరకు ఎన్‌క్యాష్ కాలేదు. దీంతో ఆ భూమి మొత్తాన్ని వాద్రా సంస్థకు ఉచితంగా ఇచ్చేశారని ఈడీ అనుమానిస్తోంది. ఈ మొత్తం లావాదేవీని ఒక లంచంగా ఈడీ భావిస్తోంది.


ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్‌ సంస్థకు హౌసింగ్ స్కీమ్ లైసెన్స్ ఇప్పించేందుకు అప్పటి హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడాపై వాద్రా ఒత్తిడి తీసుకొచ్చారని, ఆ డీల్‌లో భాగంగానే వాద్రాకు ఈ భూమిని సదరు సంస్థ ఉచితంగా ఇచ్చేసిందని ఈడీ ఆరోపిస్తోంది. అలాగే భూమి విలువను తక్కువ చేసి చూపించడం ద్వారా రూ.45 లక్షల స్టాంప్ డ్యూటీని కూడా ఎగవేశారని, ఆ కేసులో కూడా వాద్రాకు శిక్ష పడాలని ఈడీ వాదించింది. దీనిపై విచారణను ఆగస్టు 28వ తేదీకి వాయిదా వేసిన ప్రత్యేక కోర్టు వాద్రాకు నోటీసులు జారీ చేసింది.


ఇవి కూడా చదవండి

ఉద్యోగం పోయిన తర్వాత లోన్ EMIలు చెల్లించాలా? మారటోరియం?

ఐసీఐసీఐ బ్యాంక్ షాక్..ఇకపై మినిమం అకౌంట్ బ్యాలెన్స్ రూ.50 వేలకు పెంపు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 10 , 2025 | 07:15 AM