Share News

Republic Day: 'ట్రాల్ చౌక్'లో త్రివర్ణ పతాకం రెపరెపలు.. దేశ చరిత్రలో ఇదే మొదటిసారి

ABN , Publish Date - Jan 26 , 2025 | 07:14 PM

దేశ చరిత్రలోనే తొలిసారి పుల్వామాలోని ప్రఖ్యాత ''ట్రాల్ చౌక్''లో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. తరాల మధ్య ఐక్యత, దేశం పట్ల తమకున్న నిబద్ధతను చాటుకుంటూ పెద్దసంఖ్యలో ప్రజలు ఈ వేడుకలో పాల్గొన్నారు.

Republic Day: 'ట్రాల్ చౌక్'లో త్రివర్ణ పతాకం రెపరెపలు.. దేశ చరిత్రలో ఇదే మొదటిసారి

పుల్వామా: దేశ 76 గణతంత్ర వేడుకలు(Republic Day Celebrations) అంబరాన్నంటుతున్నాయి. జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir) లోనూ ఎంతో ఉత్సాహంగా ఈసారి గణతంత్ర వేడుకలు జరుగుతున్నాయి. దేశ చరిత్రలోనే తొలిసారి పుల్వామా (Pulwama)లోని ప్రఖ్యాత ''ట్రాల్ చౌక్'' (Tral Chowk)లో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. తరాల మధ్య ఐక్యత, దేశం పట్ల తమకున్న నిబద్ధతను చాటుకుంటూ పెద్దసంఖ్యలో ప్రజలు ఈ వేడుకలో పాల్గొన్నారు. మూడుతరాల ఐక్యతకు గుర్తుగా ఒక సీనియర్ సిటిజన్, మరొక యువకుడు, ఒక బాలుడు కలిసి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.

Republic Day: చెత్త తీసేసిన ప్రధాన నరేంద్ర మోదీ


భారత ఆర్మీకి చెందిన జవాన్లు, వందలాది మంది స్థానికులు జాతీయగీతాలాపన చేస్తూ జెండావదనం సమర్పించారు. యువకులు, చిన్నారులు సహా వెయ్యి మందికి పైగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. "భారత్ మాతా కీ జై'' నినాదాలు, దేశభక్తి గీతాలు మార్మోగాయి. కొద్దికాలం క్రితం వరకూ నిత్య అశాంతికి పెట్టింది పేరుగా ఉన్న పుల్వామాలో ఇప్పుడు శాంతి, ప్రగతి, జాతీయ సమగ్రతా సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయని రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.


రాష్ట్రీయ రైఫిల్స్, జమ్మూ కశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ భారీ భద్రత మధ్య ప్రశాంతంగా రిపబ్లిక్ వేడుకలు జరిగాయి. వివిధ రంగాలకు చెందిన ప్రజలు త్రివర్ణ పతాకాలు ఊపుతూ సమైక్యతను చాటుకున్నారు. ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో పాల్గొనడం ద్వారా అభివృద్ధిని, నయా కశ్మీర్‌ను తాము కోరుకుంటున్నట్టు స్పష్టమైన సంకేతాలిచ్చారు.


ఇవి కూడా చదవండి:

Republic Day 2025: 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు

Republic Day 2025: గణతంత్ర దినోత్సవం 2025 సందర్భంగా గూగుల్ స్పెషల్ డూడుల్‌..

Read More National News and Latest Telugu News

Updated Date - Jan 26 , 2025 | 07:14 PM