Share News

Rajagopal Chidambaram: ప్రముఖ అణు శాస్త్రవేత్త ఆర్ చిదంబరం కన్నుమూత

ABN , Publish Date - Jan 04 , 2025 | 10:44 AM

భారత అణు పరీక్షల్లో కీలక పాత్ర పోషించిన ప్రముఖ శాస్త్రవేత్త ఆర్ చిదంబరం 88 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. ఆయన పద్మశ్రీ, పద్మవిభూషణ్ అవార్డులు కూడా గతంలో అందుకున్నారు.

Rajagopal Chidambaram: ప్రముఖ అణు శాస్త్రవేత్త ఆర్ చిదంబరం కన్నుమూత
Rajagopal Chidambaram

భారత ప్రముఖ అణు శాస్త్రవేత్త రాజగోపాల్ చిదంబరం (Rajagopal Chidambaram) శనివారం అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఆయనకు ప్రస్తుతం 88 ఏళ్లు. అణ్వాయుధ కార్యక్రమంతో సంబంధం ఉన్న చిదంబరం ముంబైలోని జస్లోక్ ఆసుపత్రిలో తెల్లవారుజామున 3.20 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ఓ అధికారి తెలిపారు. ఆయన అటామిక్ ఎనర్జీ కమిషన్ ఛైర్మన్‌గా, భారత ప్రభుత్వానికి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్‌గా కూడా పనిచేశారు. చిదంబరం 1975 నుంచి 1998 మధ్య కాలంలో అణు పరీక్షలలో కీలక పాత్ర పోషించారు. ఆ క్రమంలో ఆయన పద్మశ్రీ, పద్మవిభూషణ్ అవార్డులు కూడా అందుకున్నారు.


శాస్త్రవేత్త నుంచి..

శాస్త్రవేత్తగా తన కెరీర్‌ ప్రారంభించిన డాక్టర్ చిదంబరం భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC) డైరెక్టర్‌గా, అటామిక్ ఎనర్జీ కమిషన్ (AEC) ఛైర్మన్‌గా, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ (DAE) కార్యదర్శిగా పనిచేశారు. ఆయన 1994-95 సమయంలో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (IAEA) గవర్నర్స్ బోర్డు ఛైర్మన్‌గా ఉన్నారు. డాక్టర్ చిదంబరం భారత ప్రభుత్వానికి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్‌గా కూడా పనిచేశారు. ఆ క్రమంలో అనేక అణు పరీక్షల సమయంలో తన సేవలను అందించారు. అణుశక్తిని శాంతియుతంగా ఉపయోగించాలనే ప్రతిపాదకుడు, భారతదేశ అణుశక్తి కార్యక్రమాన్ని వేగవంతం చేశారు.


ఇవి కూడా చదవండి:

India vs Australia: ఆస్ట్రేలియాను కట్టడి చేసిన భారత్.. క్రెడిట్ మొత్తం వీరికే


Rohit Sharma: రిటైర్మెంట్ గురించి రోహిత్ శర్మ సంచలన ప్రకటన..


Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..

Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..


Personal Finance: రూ. 10 వేల పొదుపుతో రూ. 7 కోట్ల సంపాదన.. ఎలాగో తెలుసా..

Read More National News and Latest Telugu News

Updated Date - Jan 04 , 2025 | 10:52 AM