Share News

Registration Renewal Fees Increased: 20 ఏళ్లు దాటిన వాహనాల రిజిస్ట్రేషన్‌ రెన్యూవల్‌ ఫీజు పెంపు

ABN , Publish Date - Aug 23 , 2025 | 03:11 AM

ఇరవై ఏళ్లు దాటిన పాత మోటార్‌ వాహనాల వాడకాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది..

Registration Renewal Fees Increased: 20 ఏళ్లు దాటిన వాహనాల రిజిస్ట్రేషన్‌ రెన్యూవల్‌ ఫీజు పెంపు

న్యూఢిల్లీ, ఆగస్టు 22: ఇరవై ఏళ్లు దాటిన పాత మోటార్‌ వాహనాల వాడకాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇలాంటి వాహనాల రిజిస్ర్టేషన్‌ రెన్యూవల్‌ ఫీజును భారీగా పెంచింది. ఈమేరకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీని ప్రకారం 20 ఏళ్లు దాటిన లైట్‌ మోటార్‌ వాహనాల (ఎల్‌ఎంవీ) రెన్యూవల్‌ ఫీజును రూ.5వేల నుంచి రూ.10వేలు చేశారు. 20 ఏళ్లు దాటిన మోటార్‌సైకిళ్ల రెన్యూవల్‌ ఫీజు రూ.వెయ్యి నుంచి రూ.2వేలకు పెంచారు. ఇక త్రీవీలర్లు, క్వాడ్రీసైకిళ్ల రెన్యూవల్‌ ఫీజును రూ.3,500 నుంచి రూ.5వేలకు పెంచారు. కాగా ఇంతకు ముందు మంత్రిత్వ శాఖ 2021 అక్టోబరులో మోటార్‌ సైకిళ్లు, టూ-త్రీవీలర్లు, కార్లకు సంబంధించిన రిజిస్ర్టేషన్‌, రెన్యూవల్‌ ఫీజును పెంచింది.


ఇవి కూడా చదవండి..

చట్టంగా మారిన ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు

వెబ్ సిరిస్‌లో మోదీ మాజీ బాడీగార్డ్

For More National News And Telugu News

Updated Date - Aug 23 , 2025 | 03:11 AM