Share News

Railway Station: నమ్మండి.. ఇది రైల్వేస్టేషనే..

ABN , Publish Date - Mar 04 , 2025 | 01:09 PM

నగరంలోని ప్రధాన సబర్బన్‌ రైల్వేస్టేషన్‌లో ఒకటైన మాంబళం రైల్వేస్టేషన్‌(Mambalam Railway Station) రూపురేఖలు మారనున్నాయి. వ్యాపార కేంద్రమైన టి.నగర్‌కు వచ్చే ప్రజలు మాంబళం రైల్వేస్టేషన్‌కు వస్తుంటారు.

Railway Station: నమ్మండి.. ఇది రైల్వేస్టేషనే..

- మాంబళం రైల్వేస్టేషన్‌కు నూతన సొబగులు

చెన్నై: నగరంలోని ప్రధాన సబర్బన్‌ రైల్వేస్టేషన్‌లో ఒకటైన మాంబళం రైల్వేస్టేషన్‌(Mambalam Railway Station) రూపురేఖలు మారనున్నాయి. వ్యాపార కేంద్రమైన టి.నగర్‌కు వచ్చే ప్రజలు మాంబళం రైల్వేస్టేషన్‌కు వస్తుంటారు. ప్రతిరోజు సుమారు 200 సబర్బన్‌ రైళ్లు, 90కి పైగా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఈ స్టేషన్‌ మీదుగా వెళ్లుండగా, స్టేషన్‌లో ఐదు ఫ్లాట్‌ఫారాలు(Five platforms)న్నాయి. ఈ రైల్వేస్టేషన్‌ను రూ.14.7 కోట్లతో పునరుద్ధరిస్తున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Online: మీరు ఆన్‌లైన్‌లో సెల్‌ఫోన్‌ ఆర్డరు చేస్తున్నారా.. అయితే ఒక్కక్షణం..


nani4.2.jpg

ఆ ప్రకారం, స్టేషన్‌ ఈస్ట్‌, వెస్ట్‌ ప్రవేశద్వారాల్లో ఆర్చ్‌లు ఏర్పాటుకానున్నాయి. అలాగే, పార్కింగ్‌ వసతి, కొత్తగా టిక్కెట్టు కౌంటర్లు, సీసీ కెమెరాలు(CCTV cameras), డిజిటల్‌ డిస్‌ప్లే బోర్డులు, ఫ్లాట్‌ ఫారాల విస్తరణ, లౌడ్‌ స్పీకర్లు తదితరాలు ఏర్పాటుకానున్నాయ. ప్రస్తుతం పునరుద్ధరణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని, తొలివిడత పనులు ఈ నెలాఖరుకు పూర్తిచేయాలని నిర్ణయించినట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.


ఈ వార్తను కూడా చదవండి: మెట్రో స్టేషన్ల నుంచి స్కైవాక్‌లు

ఈ వార్తను కూడా చదవండి: మరో ప్రముఖ ఆలయాన్ని దర్శించుకున్న బాలీవుడ్ నటి.. ఎవరంటే..

ఈ వార్తను కూడా చదవండి: పోచారంపై నిప్పులు చెరిగిన కవిత

ఈ వార్తను కూడా చదవండి: కృష్ణా జలాల్లో మాకు 70% వాటా ఇవ్వండి

Read Latest Telangana News and National News

Updated Date - Mar 04 , 2025 | 01:09 PM