Rahul Gandhi: పుట్టిన రోజున మారిన రాహుల్ చిరునామా
ABN , Publish Date - Jun 20 , 2025 | 04:51 AM
లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ తన 55వ పుట్టిన రోజున చిరునామా మార్చారు. న్యూఢిల్లీ సునెహ్రీ బాగ్ రోడ్‌లో ప్రభుత్వం ఆయనకు కేటాయించిన బంగ్లా నంబర్5లోకి సామాన్ల తరలింపు ప్రారంభమైంది....
న్యూఢిల్లీ, జూన్ 19: లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ తన 55వ పుట్టిన రోజున చిరునామా మార్చారు. న్యూఢిల్లీ సునెహ్రీ బాగ్ రోడ్‌లో ప్రభుత్వం ఆయనకు కేటాయించిన బంగ్లా నంబర్5లోకి సామాన్ల తరలింపు ప్రారంభమైంది. ఎంపీగా ఎన్నికైనప్పటినుంచి రాహుల్ 12 తుగ్లక్ లేన్‌లో ఉండేవారు. ఇంతకాలం ఆయన తన తల్లి సోనియాకు చెందిన 10 జన్‌పథ్ నివాసంలో ఉన్నా రు. కొంతకాలం క్రితమే సునెహ్రీ బాగ్ రోడ్‌లోని బంగ్లా నంబర్ 5ను కేటాయించారు. కాగా, పుట్టినరోజు సందర్భంగా రాహుల్‌కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు, తమిళనాడు సీఎం స్టాలిన్, ఆర్జేడీ అధినేతల లాలూ, పలువురు ఇండియా బ్లాక్ నేతలు, ఇతర పార్టీల నేతలు రాహుల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఆస్పత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జ్
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆమె ఉదర సంబంధిత సమస్యతో బాధపడుతూ 4 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నార