Brazilian Model Larissa: బ్రెజిలియన్ మోడల్ వివాదంలో బిగ్ ట్విస్ట్
ABN , Publish Date - Nov 06 , 2025 | 06:10 PM
హర్యానాలో భారీ ఎత్తున ఓట్ల చోరీ జరిగిందంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో బ్రెజిల్‌కు చెందిన ఓ మోడల్ ఫొటోను ప్రదర్శించడం చర్చనీయాంశమైంది. ఆ మోడల్ ఫొటోతో నకిలీ ఓట్లు సృష్టించారంటూ రాహుల్ ఆరోపించారు.
హర్యానాలో భారీ ఎత్తున ఓట్ల చోరీ జరిగిందంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో బ్రెజిల్‌కు చెందిన ఓ మోడల్ (Brazil Model) ఫొటోను ప్రదర్శించడం చర్చనీయాంశమైంది. ఆ మోడల్ ఫొటోతో నకిలీ ఓట్లు సృష్టించారంటూ రాహుల్ (Rahul Gandhi) ఆరోపించారు. రాహుల్ గాంధీ చూపిన ఓటర్ ఐడీ కార్డులో మునేష్ అనే పేరుతో బ్రెజిలియన్ మోడల్ ఫొటో ఉంది. ఈ వివాదంపై తాజాగా మునేష్ అనే మహిళ గురువారం మీడియాతో మాట్లాడింది. 'నా దగ్గర ఉన్న కార్డులో నా ఫోటో ఉంది. రాహుల్ గాంధీ చూపించిన కార్డులో లేదు. నేను ఓటు వేసాను. (నకిలీ కార్డులో) ఎవరి ఫోటో ఉందో నాకు తెలియదు' అని మునేష్ తెలిపింది.
బుధవారం రాహుల్ గాంధీ(Rahul Gandhi) మాట్లాడుతూ.. బ్రెజిలియన్ మహిళ ఫోటోతో కూడిన ఒకే ఓటరు ఐడి గత ఎన్నికల్లో హర్యానాలోని రాయ్‌లో 22 సార్లు ఓటు వేయడానికి ఉపయోగించబడిందని తెలిపారు. స్టాక్ ఇమేజ్ వెబ్‌సైట్‌ల నుండి డౌన్‌లోడ్ చేయబడిందని రాహుల్ అన్నారు. ఆయన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. హర్యానా ఎన్నికలు జరిగి చాలా రోజులు అయితే.. ఇప్పుడు రాహుల్ గాంధీ ఈ వివాదం లేవనెత్తడం ఏంటని ఆయన విమర్శించారు. బీహార్‌లో కాంగ్రెస్ చెప్పుకోవడానికి ఏమీ మిగలలేదని, కాబట్టి రాహుల్ గాంధీ హర్యానా(Haryana elections) ఎన్నికల ఇష్యూను తీసుకొచ్చారని అన్నారు. గత ఏడాది హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 25 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయని, అందువల్లే బీజేపీ అధికారంలోకి వచ్చిందని రాహుల్‌గాంధీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బ్రెజిల్ మోడల్ ఫొటోను ప్రదర్శించారు. ఆమె ఫొటోతో 22 నకిలీ ఓట్లు సృష్టించినా ఈసీఐ ఎందుకు కనిపెట్టలేకపోయిందని ప్రశ్నించారు.
ఇక రాహుల్ గాంధీ ప్రెస్‌మీట్ (Rahul Gandhi on Vote Chori) తర్వాత నుంచి ఆ మోడల్ ఎవరా అని నెటిజన్లు తెగ సెర్చ్ చేశారు. ఈ క్రమంలోనే లారిసా (Brazilian model Larissa) తన ఇన్‌స్టా పేజీలో ఈ ప్రెస్ మీట్ పై స్పందించారు. ఓట్ల చోరీ వార్తల్లో తన పేరు రావడం చూసి చాలా షాకయ్యానని తెలిపారు. చాలామంది తనకు ఫోన్లు చేస్తున్నారని, ఇంటర్వ్యూలు అడుగుతున్నారని తెలిపారు. ఇలా వైరల్ అవుతానని అనుకోలేదని ఆమె తెలిపారు.
ఇవి కూడా చదవండి:
Trump-Mamdani: మందానీ దెబ్బకు రగిలిపోతోన్న ట్రంప్.. న్యూయార్కర్లు పారిపోక తప్పదంటూ కామెంట్
control Pollution in Delhi: ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు సాయం చైనా