Chhattisgarh Encounter: భారీ ఎన్‌కౌంటర్.. మరో నలుగురు మావోయిస్టులు మృతి
ABN , Publish Date - Nov 06 , 2025 | 11:20 AM
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో భీకర కాల్పలు జరిగాయి. ఎన్‌కౌంటర్‌లో మరో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.
ఇంటర్నెట్ డెస్క్, నవంబర్ 6: ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో మరో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్ జిల్లా తార్లగూడెం పరిధిలోని మరికెళ్ల అడవుల్లో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మద్దేడు ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టులు ఉన్నారనే పోలీసులకు సమాచారం అందింది. దీంతో తాళ్లగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నారం-మరికెళ్ల అడవుల్లో భద్రతా బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. ప్రస్తుతం భీకర ఎదురు కాల్పులు సాగుతున్నాయి. బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 'ఆపరేషన్ కగార్' తో భారత భద్రతా దళాలు మావోస్టులను మట్టుబెడుతున్న సంగతి తెలిసిందే.