Control Pollution in Delhi: ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు సాయం చైనా
ABN , Publish Date - Nov 06 , 2025 | 06:51 AM
దేశ రాజధాని న్యూఢిల్లీని కాలుష్యం కోరల్లో నుంచి తప్పించేందుకు అవసరమైన సాయం చేస్తామంటూ చైనా ముందుకొచ్చింది.
న్యూఢిల్లీ, నవంబరు 5: దేశ రాజధాని న్యూఢిల్లీని కాలుష్యం కోరల్లో నుంచి తప్పించేందుకు అవసరమైన సాయం చేస్తామంటూ చైనా ముందుకొచ్చింది. బీజింగ్, షాంఘై నగరాల్లో కాలుష్యం సమస్యను విజయవంతంగా ఎదుర్కొన్న తాము తమ అనుభవాన్ని భారత్‌తో పంచుకొని, కాలుష్య నియంత్రణకు సహకరిస్తామని భారత్‌లోని చైనా ఎంబసీ అధికారి యూజింగ్ ఎక్స్‌లో బుధవారం ఓ పోస్టు చేశారు. న్యూఢిల్లీలో క్లౌడ్ సీడింగ్ ప్రక్రియ చేపట్టి వారం రోజులు అవుతుండగా.. బుధవారం ఉదయం తొ మ్మిది గంటలప్పుడు గాలి నాణ్యత సూచి(ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) 228గా ఉంది. గతంతో పోలిస్తే గాలి నాణ్యత మెరుగైనప్పటికీ గాలి నాణ్యత ఇంకా ప్రమాదకర స్థాయిలోనే ఉంది. న్యూఢిల్లీ తరహా పరిస్థితులనే గతంలో బీజింగ్‌లో ఎదుర్కొన్న చైనా.. 2013లో కాలుష్యంపై యుద్ధం ప్రకటించింది. వివిధ చర్యలతో బీజింగ్ కాలుష్యం బారి నుంచి దాదాపుగా బయటపడింది.