Share News

PM Modi to Harleen Deol: పీఎం సర్.. మీ స్కిన్‌కేర్‌ రహస్యమేంటి?: హర్లీన్ డియోల్

ABN , Publish Date - Nov 06 , 2025 | 02:46 PM

తొలిసారి వన్డే ప్రపంచ కప్ గెలుపొందిన మహిళా క్రికెటర్లతో పీఎం మోదీ భేటీ అయ్యారు. సరదాగా సాగిన ఈ సంభాషణలో భాగంగా ఓ మహిళా క్రికెటర్.. ఊహించని రీతిలో మోదీని ప్రశ్నించారు. ఇంతకీ ఆ మహిళ అడిగిన ప్రశ్న ఏంటి? దానిని మోదీ ఏ విధంగా ఎదుర్కొన్నారు? తెలుసుకోవాలంటే.. ఈ వార్తను చదవాల్సిందే.

PM Modi to Harleen Deol: పీఎం సర్.. మీ స్కిన్‌కేర్‌ రహస్యమేంటి?: హర్లీన్ డియోల్
PM Modi to Harleen Deol

ఇంటర్నెట్ డెస్క్: 47 ఏళ్ల మహిళల వన్డే వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి ప్రపంచ కప్‌ను కైవసం చేసుకున్న టీమ్ఇండియా ఉమెన్స్ టీమ్‌తో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప్రత్యేక భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా క్రికెటర్లు ఆయనతో సరదాగా ముచ్చటించారు. ఈ క్రమంలో బ్యాటింగ్ ఆల్‌రౌండర్ హర్లీన్ డియోల్ అడిగిన ఓ ప్రశ్న అక్కడున్న అందరినీ నవ్వించేలా చేసింది. సంభాషణలో భాగంగా.. 'సర్.. మీరు ఎల్లప్పుడూ కాంతివంతంగా మెరుస్తూ ఉంటారు. మీ స్కిన్‌కేర్‌ రహస్యమేంటి.?' అని నవ్వుతూ అడిగారు. ఊహించని రీతిలో ఎదురైన ఈ ప్రశ్నకు మహిళా క్రికెటర్లంతా ఒక్కసారిగా చిరునవ్వులు పూయించారు. దీనికి మోదీ స్పందిస్తూ.. 'నేనెప్పుడూ అలాంటి వాటి గురించి పట్టించుకోను' అని జవాబిచ్చారు.


కోట్లాది మంది ప్రేమతోనే: స్నేహ్ రాణా

ఇంతలో.. మరో మహిళా క్రికెటర్ స్నేహ్ రాణా ఆ ప్రశ్నకు ఇంకోలా సమాధానమిచ్చారు. 'సర్, దేశంలోని కోట్లాది మంది ప్రేమ వల్లే.. ఇది సాధ్యమౌతోంది.' అని వ్యాఖ్యానించగా.. టీమ్ సభ్యులంతా మరోసారి నవ్వుకున్నారు. ఈ విషయమై టీమ్ మెయిన్ కోచ్ అమోల్ మజుందార్ సరదాగా స్పందించారు. 'చూశారా సర్(మోదీతో).. ఇలాంటి వారిని నేను డీల్ చేయాల్సి వస్తోంది. అందుకేనేమో నా జుట్టంతా తెల్లబడిపోయింది' అని చమత్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. హర్లీన్ డియోల్ 2021లో ఇంగ్లండ్‌పై అందుకున్న అద్భుతమైన క్యాచ్‌ను గురించి గుర్తుచేశారు. మహిళా క్రికెటర్ల భేటీలో భాగంగా.. సరదాగా సాగిన ఈ సంభాషణనంతా పీఎం మోదీ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు.


నేడు రాష్ట్రపతితో భేటీ

అద్భుతంగా ఆడి తొలిసారి వన్డే ప్రపంచ కప్‌ను అందుకున్న భారత మహిళా క్రికెటర్లు.. నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్నారు.


ఇవి కూడా చదవండి:

Trump-Mamdani: మందానీ దెబ్బకు రగిలిపోతోన్న ట్రంప్.. న్యూయార్కర్లు పారిపోక తప్పదంటూ కామెంట్

control Pollution in Delhi: ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు సాయం చైనా

Updated Date - Nov 06 , 2025 | 05:20 PM