Share News

Premalatha: పొత్తులపై మహానాడులో ప్రకటిస్తా..

ABN , Publish Date - May 23 , 2025 | 11:25 AM

మరికొద్ది రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులపై త్వరలో జరిగే పార్టీ మహానాడులో ప్రకటిస్తానని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత తెలిపారు. జనవరి 9వ తేదీ కడలూరులో నిర్వహించనున్న పార్టీ మహానాడులో అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు, పార్టీ తరుఫున పోటీ చేసే అభ్యర్థుల వివరాలను వెల్లడించనున్నట్లు తెలిపారు.

Premalatha: పొత్తులపై మహానాడులో ప్రకటిస్తా..

- డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత

చెన్నై: వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుపై కడలూరు మహానాడులో ప్రకటించనున్నట్లు డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత(Premalatha) పేర్కొన్నారు. నామక్కల్‌లో గురువారం జరిగిన డీఎండీకే నిర్వాహకుల సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన విధి, విధానాలను ప్రేమలత వివరించారు.


అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఏడాది జనవరి 9వ తేదీ కడలూరులో నిర్వహించనున్న పార్టీ మహానాడులో అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు, పార్టీ తరుఫున పోటీ చేసే అభ్యర్థుల వివరాలను వెల్లడించనున్నట్లు తెలిపారు. అంతకు ముందు 234 నియోజకవర్గాల్లో ఎన్నికల ఇన్‌ఛార్జుల ఎంపిక మొదలుపెడతామన్నారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విజయ్‌ ప్రభాకర్‌తో కలిసి తాను పర్యటించి, పార్టీ నిర్వాహకులను, ప్రజలను కలుసుకోనున్నట్టు ప్రేమలత తెలిపారు.


nani3.2.jpg

2021 నుంచి కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో నిర్వహించిన ‘నీతి ఆయోగ్‌’ సమావేశంలో తమిళనాడు తరుఫున డీఎంకే మంత్రులు మాత్రమే పాల్గొన్నారని, కొన్ని సమావేశాల్లో వారిని అనుమతించలేదని, అయితే ఈ నెల 24న జరగనున్న సమావేశంలో తాను పాల్గొనబోతున్నట్లు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రకటించడం పలు అనుమానాలకు దారితీస్తోందని, ఆయ న ఎందుకోసం వెళ్తున్నారో రాష్ట్రప్రజలకు స్పష్టంగా చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి.

బాబోయ్ మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..

సీఎం ఓఎస్‌డీని అంటూ మెయిల్స్‌, కాల్స్‌

Read Latest Telangana News and National News

Updated Date - May 23 , 2025 | 11:25 AM