PM Modi: రూ.60,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ
ABN , Publish Date - Sep 27 , 2025 | 02:47 PM
ఒడిశాలో 2024 జూన్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాష్ట్రంలో ప్రధాని మంత్రి పర్యటించడం ఇది ఆరోసారి. ఝార్సుగూడలో ఏడేళ్ల తర్వాత ఆయన పర్యటించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
ఝార్సుగూడ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendara Modi) ఒడిశాలోని ఝార్సుగూడ నుంచి రూ.60,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను శనివారం నాడు ప్రారంభించారు. టెలి కమ్యూనికేషన్లు, రైల్వేలు, హైయర్ ఎడ్యుకేషన్ వంటి రంగాలు ఇందులో ఉన్నాయి.
దేశవ్యాప్తంగా 8 ఐఐటీ (IITs)ల విస్తరణకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ ఐఐటీల్లో వచ్చే నాలుగేళ్లలో 10,000 మంది కొత్త స్టూడెంట్లకు సీట్లు లభించనున్నాయి. గుజరాత్‌లోని సూరత్ జిల్లా ఉఢనాతో బెర్హాంపూర్‌ను కలిపే అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. రూ.1,400 కోట్లతో నిర్మించిన 34 కిలోమీటర్ల కోరాపుట్-బయిగూడ రైల్వే లైన్ డబ్లింగ్, 82 కిలోమీటర్ల మన్‌బార్-కొరాపుట్-గోరాపూర్ సెక్షన్‌ను ప్రధాని జాతికి అంకితం చేశారు. బీఎస్ఎన్ఎల్ స్వదేశీ టెక్నాలజీతో నిర్మించిన 97,500కు పైగా 4-జి టెలికాం టవర్స్‌ను ప్రారంభించారు. రూ.273 కోట్లతో సంబల్‌పూర్ సిటీలో నిర్మించిన 5 కిలోమీటర్ల ఫ్లైఓవర్‌ను ప్రారంభించారు.
ఒడిశాలో 2024 జూన్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాష్ట్రంలో ప్రధాని మంత్రి పర్యటించడం ఇది ఆరోసారి. ఝార్సుగూడలో ఏడేళ్ల తర్వాత ఆయన పర్యటించారు. చివరిసారిగా 2018 సెప్టెంబర్ 22న ఒడిశాలో రెండో కమర్షియల్ ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించేందుకు ఇక్కడికి వచ్చారు.
ఇవి కూడా చదవండి..
మా విజయాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు..
సొమ్ము చెల్లిస్తే చెక్ బౌన్స్ నుంచి విముక్తి!
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి