Share News

నేడు యూకే పర్యటనకు ప్రధాని మోదీ

ABN , Publish Date - Jul 23 , 2025 | 03:56 AM

ప్రధాని మోదీ బుధవారం యూకే పర్యటనకు వెళ్లనున్నారు. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై

నేడు యూకే పర్యటనకు ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, జూలై 22: ప్రధాని మోదీ బుధవారం యూకే పర్యటనకు వెళ్లనున్నారు. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై అధికారికంగా సంతకం చేయడం, రక్షణ, భద్రతా రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను విస్తరించుకునే చర్యల్లో భాగంగా ప్రధాని మోదీ యూకేలో పర్యటించనున్నారని భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ వెల్లడించారు. ఈ పర్యటనలో బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌తో మోదీ భేటీ కానున్నారని చెప్పారు. ఈ పర్యటనకు మోదీతో పాటు కేంద్ర వాణిజ్య మంత్రి గోయల్‌ కూడా వెళ్లనున్నారు. బ్రిటన్‌ పర్యటన ముగిసిన అనంతరం మోదీ అటు నుంచి నేరుగా మాల్దీవుల పర్యటనకు వెళ్లనున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు

ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ

మరిన్ని జాతీయతెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 23 , 2025 | 03:56 AM