PM Modi: ఫ్రాన్స్ అధ్యక్షుడితో కలిసి ఏఐ సమావేశానికి మోదీ అధ్యక్షత
ABN , Publish Date - Feb 07 , 2025 | 07:43 PM
పారిస్‌లో జరిగే కృత్రిమ మేథ సదస్సులో పాల్గొనేందుకు ఈనెల 10న మోదీ వెళ్తున్నట్టు విదేశాంగ శాఖ కార్యదరశి విక్రమ్ మిస్రీ తెలిపారు. ఈ సదస్సులో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్‌తో కలిసి ఏఐ యాక్షన్ కమిటీ సమావేశానికి మోదీ అధ్యక్షత వహించనున్నారు.

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఫ్రాన్స్ (France) పర్యటన ఖరారైంది. ఈనెల 10 నుంచి 12వ తేదీ వరకూ ఫ్రాన్స్‌లో మోదీ పర్యటించనున్నారు. పారిస్‌లో జరిగే కృత్రిమ మేథ (Artificial Intelegence) సదస్సులో పాల్గొనేందుకు ఈనెల 10న మోదీ వెళ్తున్నట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్ (Emmanuel Macron)తో కలిసి ఏఐ యాక్షన్ కమిటీ సమావేశానికి మోదీ అధ్యక్షత వహించనున్నారు.
PM Modi: ట్రంప్‌తో మోదీ మీటింగ్ ఫిక్స్.. ఎప్పుడంటే
ఇమ్మాన్యుయెల్ ఆహ్వానం మేరకు మోదీ ఫ్రాన్స్ వెళ్తున్నారని, మెక్రాన్ ఇచ్చే విందులో కూడా పాల్గొంటారని విక్రమ్ మిస్రీ తెలిపారు. 11న ఏఐ యాక్షన్ కమిటీ సమావేశానికి మెక్రాన్‌తో కలిసి మోదీ అధ్యక్షత వహించడం విశేషమని చెప్పారు. ఈ తరహా సమావేశంలో ఇటీవల కాలంలో జరగడం ఇది మూడోసారని చెప్పారు. 2023లో యూకేలోనూ, 2024లో రిపబ్లిక్ ఆఫ్ కొరియాలోనూ, ఇప్పుడు ఫ్రాన్స్‌లోనూ జరుగుతోందన్నారు. మోదీ ఫ్రాన్స్ పర్యటనలో ఇరుదేశాల మధ్య ఏరోస్పేస్, ఇంజన్స్, సబ్‌మెరైన్లు తదితర అంశంపైన చర్చలు జరుగుతున్నాయని దౌత్య వర్గాలు చెబుతున్నాయి. ఫ్రెంచ్ కంపెనీల టాప్ సీఈఓలను కూడా మోదీ కలుసుకుంటారు.
కాగా, ఫ్రాన్స్ పర్యటన ముగియగానే 12వ తేదీ సాయంత్ర వాషింగ్టన్ డీసీకి మోదీ చేరుకుంటారు. 13న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో భేటీ అవుతారు. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మోదీ అమెరికాలో జరుపుతున్న తొలి అధికార పర్యటన ఇదే కావడం విశేషం.
ఇవి కూడా చదవండి..
AAP: ఆప్ నేతల వ్యాఖ్యలపై జెట్‌స్పీడ్ రియాక్షన్.. కేజ్రీవాల్ ఇంటికి ఏసీబీ
Maha Kumbh 2025: మహా కుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా మంటలు..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి