Share News

RSS: ఆర్‌ఎస్‌ఎస్ ప్రపంచంలోనే అతి పెద్ద ఎన్‌‌జీవో.. వందేళ్ల సందర్భంగా ప్రధాని మోదీ ప్రశంసలు..

ABN , Publish Date - Aug 15 , 2025 | 11:05 AM

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వేతర సంస్థ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ఆర్‌ఎస్‌ఎస్ వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ అభినందనలు తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ సైద్ధాంతిక మాతృ సంస్థ అయిన ఆర్‌ఎస్‌ఎస్‌ను కొనియాడారు.

RSS: ఆర్‌ఎస్‌ఎస్ ప్రపంచంలోనే అతి పెద్ద ఎన్‌‌జీవో.. వందేళ్ల సందర్భంగా ప్రధాని మోదీ ప్రశంసలు..
RSS chief Mohan Bhagwat with PM Modi

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వేతర సంస్థ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) కొనియాడారు. ఆర్‌ఎస్‌ఎస్ వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ అభినందనలు తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ (BJP) సైద్ధాంతిక మాతృ సంస్థ అయిన ఆర్‌ఎస్‌ఎస్‌ను కొనియాడారు. దేశం నిర్మాణంలో ఆర్‌ఎస్‌ఎస్ బలమైన భూమిక పోషించిందన్నారు.


79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌ను ప్రధానమంత్రి అభినందించారు. 'ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల క్రితం ఏర్పడింది. జాతి నిర్మాణంలో ఆర్‌ఎస్‌ఎస్ పాలుపంచుకుంది. ఆర్ఎస్ఎస్ భారతదేశ సేవకు అంకితం అయింది. ఆర్‌ఎస్‌ఎస్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్జీఓ. ఆర్ఎస్ఎస్ చరిత్ర పట్ల నాకు గర్వంగా ఉంది' అని ప్రధాని మోదీ అన్నారు. ఇక, భువనేశ్వర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రసంగించారు (100 Years for RSS).


'మన పూర్వీకుల అత్యున్నత త్యాగాల కారణంగానే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి, ఆత్మవిశ్వాసం నింపడానికి, గొడవల్లో మునిగి ఉన్న ప్రపంచానికి మార్గనిర్దేశం చేసే విశ్వ గురువుగా ఉద్భవించడానికి మనం ఎంతో కష్టపడి పనిచేయాలి. కేవలం స్వాతంత్ర్యం సాధించుకోవడంతోనే మనం సంతృప్తి చెందకూడద'ని మోహన్ భగవత్ అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆగస్టు 26 నుంచి మెగా వేడుకలు నిర్వహించబోతున్నారు. ఈనెల 26 నుంచి 28 వరకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈ వేడుకలు జరగబోతున్నాయి.


ఇవి కూడా చదవండి

ఆ 65 లక్షల మంది పేర్లను వెబ్‌సైట్‌లో పెట్టండి.. ఎలక్షన్ కమిషన్‌కు సుప్రీంకోర్టు ఆదేశం..

ధర్మస్థల కేసులో ఆశ్చర్యకర నిజాలు..ఆ 80 శవాలు నేనే పాతిపెట్టా..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 15 , 2025 | 11:25 AM