PM Modi: అలసిపోతావు చిన్నా.. ప్రసంగాన్ని మధ్యలోనే ఆపిన మోదీ
ABN , Publish Date - May 30 , 2025 | 08:46 PM
పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌కు గుణపాఠం చెప్పిన తీరును మోదీ ప్రస్తావిస్తుండగా ఆయన దృష్టి దృష్టి ఓ బాలుడిపై పడింది.
కాన్పూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో రూ.47,000 కోట్లు విలువచేసే పలు అభివృద్ధి కార్యక్రమాలను శుక్రవారంనాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌కు గుణపాఠం చెప్పిన తీరును కూడా ఈ సందర్భంగా ప్రధాని వివరించారు. ఇదే సమయంలో మోదీ దృష్టి ఓ బాలుడిపై పడింది. ఆపకుండా రెండూ చేతులూ ఉపుతూ కేంరితలు కొడుతున్న ఆ బాలుడుని చూసి ముచ్చటపడ్డారు. మధ్యలోనే తన ప్రసంగాన్ని ఆపుతూ ఆ పిల్లాడికి జాగ్రత్తలు చెప్పారు.
'చాలా సేపటి నుంచి ఆ పిల్లవాడు గాలిలో చేతులు ఊపుతున్నాడు. ఆ తర్వాత అలిసిపోయి భుజాలు చాలా నొప్పిపెడతాయి' అంటూ వేదిక పైనుంచే మోదీ అన్నారు. చేతులు కిందకు దించాలని సూచించారు. అయితే ప్రధాని సూచనతో ఆ బాలుడు మరింత ఉత్సాహంతో చేతులు ఆడించడం కొనసాగించాడు. దీంతో మోదీ చిరునవ్వులు చిందించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో రావడంతో ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటూ వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి..
మన సైన్యం దాడులను చూసి యుద్ధం ఆపాలని వేడుకున్నారు..
మన సైన్యం దాడులను చూసి యుద్ధం ఆపాలని వేడుకున్నారు..
For National News And Telugu News