Share News

Operation Sindoor: త్రివిధ దళాధిపతులతో మోదీ అత్యున్నత స్థాయి సమావేశం

ABN , Publish Date - May 10 , 2025 | 02:40 PM

భారత్‌లో 26 లొకేషన్లపై పాక్ డ్రోన్ దాడులకు ప్రతిగా శనివారం తెల్లవారు జామున నాలుగు ఎయిర్‌బేస్‌లపై భారత్ దాడులు చేసింది. అనంతరం నేపథ్యంలో మోదీ ఈ సమావేశం నిర్వహించారు.

Operation Sindoor: త్రివిధ దళాధిపతులతో మోదీ అత్యున్నత స్థాయి సమావేశం

న్యూఢిల్లీ: భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రం కావడంతో కీలక సమావేశం జరిగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) శనివారంనాడు తన నివాసంలో త్రివిధ దళాధిపతులతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ సైతం పాల్గొ్న్నారు. భారత్‌లో 26 లొకేషన్లపై పాక్ డ్రోన్ దాడులకు ప్రతిగా శనివారం తెల్లవారు జామున నాలుగు పాక్ ఎయిర్‌బేస్‌లపై భారత్ దాడులు చేసింది. అనంతరం నేపథ్యంలో మోదీ ఈ సమావేశం నిర్వహించారు.

Delhi Airport: ఢిల్లీపై మిసైల్ అటాక్.. ఇది నిజమేనా..


మరోవైపు ఇండియా-పాక్ సైనిక ఉద్రిక్తలపై సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్‌తో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఫోనులో సంభాషించారు. పాక్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పలు దేశాల మద్దతును జైశంకర్ కూడగడుతున్నారు.


దీనికి మందు, ఇండియా, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తాజా పరిణామాలపై విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మీడియాకు వివరించారు. పాక్ చర్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని, దాడులపై తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తోందని మిస్రి చెప్పారు. పాక్ దాడులను దీటుగా జవాబిస్తున్నట్టు తెలిపారు. భారత మిలటరీ స్థావరాలు, మౌలిక సదుపాయాలను దెబ్బతీసినట్టు పాక్ చేస్తున్న దుష్ప్రచారంలో నిజం లేదని తెలిపారు.


ఇవి కూడా చదవండి..

Operation Sindoor: పాక్ వైమానిక స్థావరాలపై బాంబుల వర్షం..

Operation Sindoor: పౌరులు, ఆలయాలపైనే పాక్ దాడి.. వీడియోలతో భారత్ కౌంటర్

Updated Date - May 10 , 2025 | 02:46 PM