Share News

PM Modi: ఢిల్లీ పేలుడు బాధితులను ఆసుపత్రిలో పరామర్శించిన మోదీ

ABN , Publish Date - Nov 12 , 2025 | 03:27 PM

రెండ్రోజుల భూటాన్ పర్యటన ముగించుకుని వచ్చిన ప్రధాని ఆ వెంటనే లోక్‌నాయక్ జయప్రకాష్ ఆసుపత్రికి వెళ్లారు. బాధితులతో నేరుగా మాట్లాడి త్వరగా కోలుకోవాలని అభిలషించారు.

PM Modi: ఢిల్లీ పేలుడు బాధితులను ఆసుపత్రిలో పరామర్శించిన మోదీ
PM Modi

న్యూఢిల్లీ: ఢిల్లీ పేలుడు ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) బుధవారంనాడు పరామర్శించారు. రెండ్రోజుల భూటాన్ పర్యటన ముగించుకుని వచ్చిన ప్రధాని ఆ వెంటనే లోక్‌నాయక్ జయప్రకాష్ (LNJP) ఆసుపత్రికి వెళ్లారు. బాధితులతో నేరుగా మాట్లాడి త్వరగా కోలుకోవాలని అభిలషించారు. వైద్యులు, అధికారులతో మాట్లాడారు. బాధితుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.


ప్రధాని రాక కోసం ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద మీడియా వేచి ఉండటంతో ఆయన ఆసుపత్రిలో వెనుక వైపునున్న ప్రత్యేక గేటు ద్వారా లోపలకు వెళ్లారు. ఢిల్లీలో పేలుడుకు బాధ్యులైన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని, వారిని చట్టం ముందు ఉంచుతామని పేలుడు ఘటన అనంతరం మోదీ స్పష్టం చేశారు. ఢిల్లీ పేలుడు దుర్ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టింది.


ఇవి కూడా చదవండి..

ఎర్రకోట బాంబ్ బ్లాస్ట్.. ఎలా జరిగిందో చూడండి.. సీసీటీవీ వీడియో వైరల్..

దీపావళికి ప్లాన్ చేసి.. ఆపై విరమించుకుని...

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 12 , 2025 | 04:30 PM