PM Kisan Yojana: రైతులకు అలర్ట్.. ఏప్రిల్ 30 లోపు ఈ పని చేయకుంటే డబ్బులు రావు..
ABN , Publish Date - Apr 18 , 2025 | 05:29 PM
రైతులకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. ఇందులో ప్రధాన పథకం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఈ పథకాన్ని 2019 ఫిబ్రవరి 24న ప్రారంభించారు. పీఎం కిసాన్ పథకం కింద, అర్హత కలిగిన రైతులకు ప్రతి 4 నెలలకు

PM Kishan Samman Nidhi Yojana: రైతులకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. ఇందులో ప్రధాన పథకం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఈ పథకాన్ని 2019 ఫిబ్రవరి 24న ప్రారంభించారు. పీఎం కిసాన్ పథకం కింద, అర్హత కలిగిన రైతులకు ప్రతి 4 నెలలకు రూ. 2000 చొప్పున.. సంవత్సరానికి రూ. 6000 ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఇప్పటి వరకు 19 విడతలుగా నిధులు బదిలీ చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు 20వ విడత నిధుల బదిలీకి సన్నద్ధమైంది. ఈ 20 విడత నిధులు పొందాలంటే రైతులు చేయాల్సిన పని ఒకటి ఉంది. అది పూర్తి చేస్తే గానీ.. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవ్వవు.
పీఎం కిసాన్ పథకానికి షరతులివే..
ఈ పథకం ప్రయోజనం పొందాలంటే.. సదరు వ్యక్తి తప్పనిసరిగా భారతీయ పౌరుడై ఉండాలి. వ్యవసాయ భూమి కలిగి ఉండాలి. అలాగే.. ఒక కుటుంబాన్ని ఒక యూనిట్‌గా కేంద్రం పరిగణించింది.
20వ విడత నిధులు ఎప్పుడు..
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ప్రభుత్వం ఇప్పటి వరకు మొత్తం రూ.3.68 లక్షల కోట్లను రైతుల ఖాతాలకు బిదిలీ చేసింది. 24 ఫిబ్రవరి 2025న ప్రధాని నరేంద్ర మోదీ 19వ విడత కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం నిధులను విడుదల చేశారు. డీబీటీ విధానంలో 9.8 కోట్ల మంది రైతులకు రూ. 22,000 కోట్లు ఆర్థిక సాయం అందజేశారు. ఇప్పుడు 20వ విడత నిధులు త్వరలోనే విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. జూన్ 2025 నాటికి 20వ విడత నిధులు రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ తేదీ అనధికారికం మాత్రమే. ఫైనల్ తేదీని ప్రభుత్వం త్వరలోనే ప్రకటించనుంది.
డబ్బులు రావాలంటే.. ఇది తప్పనిసరి..
కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద 20వ విడత ప్రయోజనాన్ని పొందడానికి రైతులు తప్పనిసరిగా e-KYC చేయించుకోవాలి. ఒక వేళ ఈ కేవైసీ చేయకపోతే.. 20వ విడత డబ్బులు రైతుల ఖాతాలో జమ అవ్వవు. అర్హత కలిగిన రైతులు ఏప్రిల్ 30వ తేదీ లోపు ఈ-కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాల్సి ఉంటుంది.
భూమి ధృవీకరణ..
ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకం ప్రయోజనం పొందాలంటే.. రైతులు తమ భూమిని ధృవీకరించాల్సి ఉంటుంది. భూమికి సంబంధించిన పట్టా వివరాలను నమోదు చేస్తేనే.. ఈ పథకం ప్రయోజనం పొందడానికి వీలుంటుంది. లేదంటే.. పథకం కింద వచ్చే డబ్బులు పొందలేరు.
మొబైల్, బ్యాంక్ ఖాతా అనుసంధానం..
అదేవిధంగా, రైతులు తమ ఆధార్‌ను మొబైల్, బ్యాంక్ ఖాతాలకు అనుసంధానించాలి. లేదంటే పీఎం కిసాన్ డబ్బులు రావు. రైతులు వీలైనంత త్వరగా బ్యాంకుకు వెళ్లి వారి ఆధార్ కార్డును, మొబైల్ నెంబర్‌ను బ్యాంకు ఖాతాకు అనుసంధానించుకోవాలి.
ఎలాంటి తప్పులు ఉండకూడదు..
అలాగే, దరఖాస్తు ఫారమ్‌లో ఏదైనా తప్పులు ఉన్నా.. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవ్వవు. అందుకే.. ఈ విషయాల్లో రైతులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..
మీరు కూడా ఈ పథకానికి అర్హులైతే.. 20వ విడత డబ్బులు మీకు వస్తాయో లేదో స్టేటస్ తెలుసుకోవచ్చు.
ఇందుకోసం మీరు అధికారిక వెబ్‌సైట్ Pmkisan.gov.in ని సందర్శించాలి.
అదికాకపోతే పీఎం కిసాన్ యాప్‌లో కూడా చెక్ చేయవచ్చు.
సైట్ ఓపెన్ చేశాక 'లబ్ధిదారుల జాబితా' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
ఆ తర్వాత మీరు మీ రాష్ట్రాన్ని ఎంచుకోవాలి, ఆపై మీ జిల్లా, మండలం, బ్లాక్, గ్రామాన్ని ఎంచుకోవాలి.
దీని తర్వాత మీరు 'గెట్ యువర్ రిపోర్ట్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
ఇప్పుడు లబ్ధిదారుల జాబితా ఓపెన్ అవుతుంది.
ఈ జాబితాలో మీ పేరు ఉంటే మీరు 20వ విడత పీఎం కిసాన్ డబ్బులు పొందుతారు.
Also Read:
కేఎల్ రాహుల్ కూతురి పేరు తెలుసా
ఎట్టకేలకు FBIకి చిక్కిన హ్యాపీ పాసియా
ఈ సంఖ్య ఉన్న అమ్మాయిలు ద్రోహం చేయరు..
For More National News and Telugu News..