PM Kisan: ఈ దఫా పీఎం కిసాన్ 29 లక్షల మందికి షాకివ్వొచ్చు..
ABN , Publish Date - Nov 06 , 2025 | 02:35 PM
పీఎం కిసాన్ నిధులు త్వరలో బ్యాంకు ఖాతాల్లో పడనున్నాయి. అయితే, ప్రస్తుతం ఉన్న లబ్ధిదారులను పూర్తిస్థాయిలో వెరిఫికేషన్ చేసిన తర్వాతే 21వ విడత విడుదల చేయాలని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం. దీంతో లక్షల మంది అనర్హులైన వారు..
PM Kisan Verification: ఈ ఏడాదిలో మూడోసారి రైతులకు కేంద్ర అందించే కిసాన్ నిధులు త్వరలో విడుదల కానున్నాయి. అయితే, ప్రస్తుతం ఉన్న లబ్ధిదారులను పూర్తిస్థాయిలో వెరిఫికేషన్ చేసిన తర్వాతే 21వ విడత విడుదల చేయాలని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం. లక్షల మంది అనర్హులైన వారు లబ్ధి పొందుతున్నట్లు గుర్తించిన క్రమంలో కేంద్రం నిబంధనలను కఠినతరం చేసింది.
ఇందుకోసం ప్రస్తుతం లబ్ధిదారుల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి అనర్హుల పేర్లను తొలగిస్తున్నట్టు తెలుస్తోంది. వెరిఫికేషన్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించడం, అర్హత లేని, డూప్లికేట్ లబ్ధిదారులను తొలగిస్తున్నట్టు చెబుతున్నారు. కేంద్రంలోని వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ దాదాపు 29 లక్షల అనుమానిత కేసులను గుర్తించింది.
అందులో ఒకే కుటుంబంలో భార్యాభర్తలు ఇరువురూ లబ్ధిపొందడం వంటివి ఉన్నాయి. ఇలాంటి కేసులను రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు తనిఖీ చేసి గుర్తించనున్నారు. ఇంతకు ముందు ఇలాంటి ప్రక్రియనే 2022లోనూ నిర్వహించి 1.72 కోట్ల మంది అనర్హులైన రైతుల పేర్లను పీఎం కిసాన్ డేటా బేస్ నుంచి తొలగించారు. కాగా, పీఎం కిసాన్ స్కీమ్ కింద ప్రతి ఏటా ఒక్కో రైతు కుటుంబానికి రూ.6000 చొప్పున పెట్టుబడి సాయం మోదీ సర్కారు అందిస్తోంది.
ఇవి కూడా చదవండి:
Welfare Schemes: రూ.1.68 లక్షల కోట్ల మహిళా పథకాలు
PM Modi-Bihar Election: కంగ్రాట్స్ యంగ్ స్టర్స్.. మొదట ఓటు, తరువాత రిఫ్రెష్‌మెంట్: ప్రధాని మోదీ