Share News

PM Modi: ఆటవిక పాలన నుంచి అభివృద్ధికి బాటలు వేశాం: మోదీ

ABN , Publish Date - Jun 20 , 2025 | 02:46 PM

ఎన్డీయే హయాంలో సాధించిన కీలక విజయాలను ప్రధాని ప్రస్తావిస్తూ, 55,000 కిలోమీటర్ల మేర గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు వేశామని, 1.5 కోట్ల ఇళ్లకు విద్యుత్ ఇచ్చామని, 26 కోట్ల మందికి పైపుల ద్వారా తాగునీటిని అందించామని చెప్పారు.

PM Modi: ఆటవిక పాలన నుంచి అభివృద్ధికి బాటలు వేశాం: మోదీ

పాట్నా: బీహార్‌ను ఆటవిక రాజ్యంలోని నెట్టిన ఘనత కాంగ్రెస్, ఆర్జేడీలదేనని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) విమర్శలు గుప్పించారు. ప్రజలే ఆటవిక పాలనకు చరమగీతం పాడారని, ఇప్పుడు ఎన్డీయే హయాంలో బీహార్ బలమైన అభివృద్ధి దిశగా పయనిస్తోందని అన్నారు. బీహార్‌లోని సివాన్‌లో శుక్రవారంనాడు జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ, రాష్ట్రం దశాబ్దాలుగా పేదరికంలో మగ్గడానికి, కార్మికుల వలసలకు కాంగ్రెస్, ఆర్జేడీలే కారణమని అన్నారు.


ఎన్డీయే హయాంలో సాధించిన కీలక విజయాలను ప్రధాని ప్రస్తావిస్తూ, 55,000 కిలోమీటర్ల మేర గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు వేశామని, 1.5 కోట్ల ఇళ్లకు విద్యుత్ ఇచ్చామని, 26 కోట్ల మందికి పైపుల ద్వారా తాగునీటిని అందించామని చెప్పారు. బీహార్‌ను ఆటవిక రాజ్యంగా మార్చిన వారు తమ తప్పిదాలను పునరావృతం చేయాలనుకుంటున్నారని, మీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని హెచ్చరించారు.


పేదలకు మరిన్ని ఇళ్లు

పేదలకు మరో మూడు కోట్ల ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రధాని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ప్రజలే తన కుటుంబ సభ్యులనీ, కుటుంబంలోని ఏ ఒక్కరూ కడగండ్లపాలు కాకుండా చూస్తామని, వారి కోసం రేయింబవళ్లూ శ్రమిస్తామని, తమ కల నిజమయ్యేంత వరకూ విశ్రాంతి తీసుకునేది లేదని చెప్పారు. బీహార్ స్వాతంత్ర్య సమరయోధుల గడ్డ అని ప్రశంసించారు. భారతదేశం గ్లోబల్ పవర్‌గా ఎదగడంలో బీహార్ కీలక భూమిక వహిస్తోందని చెప్పారు. భారతదేశం శీఘ్రగతిన పురోగమిస్తుండటంపై ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా చూస్తున్నాయని, త్వరలోనే ప్రపంచలోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలువనుందని వారు బలంగా నమ్ముతున్నారని చెప్పారు.


ఈ సందర్భంగా పలు హౌసింగ్, వాటర్, రైల్, పవర్, మ్యాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లోని పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ (పీఎంఏవై-యూ) కింద 6,600 మంది లబ్ధిదారులకు తాళం చెవులు అందజేశారు. పీఎంఏవై-యూ లబ్ధిదారులకు తొలి విడత ఇన్‌స్టాల్‌మెంట్‌గా రూ.536 కోట్లు విడుదల చేశారు. మర్హౌరా ప్లాంట్‌లో తయారైన లోకోమోటివ్‌ను జెండా ఊపి ప్రారంభించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి..

ఎంపీ శశిథరూర్ వ్యాఖ్యలు.. స్పందించిన కాంగ్రెస్ పార్టీ

ఎయిర్ ఇండియా సంస్థ కీలక నిర్ణయం.. ఆ రూట్లలో విమాన సర్వీసులు రద్దు

For National News And Telugu News

Updated Date - Jun 20 , 2025 | 02:48 PM