Share News

Lemon 5 Lakh: ఈ నిమ్మకాయ ధర అక్షరాలా రూ. 5 లక్షలు..

ABN , Publish Date - Feb 16 , 2025 | 08:52 PM

ఒక నిమ్మకాయ ధర ఎంత ఉంటుంది.. 2 రూపాయలో.. 3 రూపాయలో ఉంటుంది. బాగా డిమాండ్ ఉన్నప్పుడు మహా అయితే ఒక కాయ 5 నుంచి 10 రూపాయల వరకు ఉంటుంది. మరి అదే నిమ్మకాయ ధర 10 కాదు.. 100 కాదు.. 1000 కాదు.. ఏకంగా..

Lemon 5 Lakh: ఈ నిమ్మకాయ ధర అక్షరాలా రూ. 5 లక్షలు..
Palani Murugan

చెన్నై, ఫిబ్రవరి 16: ఒక నిమ్మకాయ ధర ఎంత ఉంటుంది.. 2 రూపాయలో.. 3 రూపాయలో ఉంటుంది. బాగా డిమాండ్ ఉన్నప్పుడు మహా అయితే ఒక కాయ 5 నుంచి 10 రూపాయల వరకు ఉంటుంది. మరి అదే నిమ్మకాయ ధర 10 కాదు.. 100 కాదు.. 1000 కాదు.. ఏకంగా లక్షల్లో ధర పలికితే.. ఇంకేముంది.. రెండు చేతులు జేబులో పెట్టుకుని వెళ్లిపోవడమే అనుకుంటాం. కానీ, ఇక్కడ అలా జరుగలేదండోయ్.. ఒక నిమ్మకాయ ధర ఏకంగా రూ. 5.9 లక్షలు పలికింది. మరి లక్షలు పెట్టి కొనేంత స్పెషల్ ఈ నిమ్మకాయలో ఏముంది.. ఆ వివరాలన్నీ ఈ కథనంలో తెలుసుకుందాం..


హైదరాబాద్‌లో గణేశుని చేతిలోని లడ్డూకు ఎంత ప్రాధాన్యం ఉందో తమిళనాడులోని పళనిలో మురుగన్‌ పాదాల చెంత పెట్టే నిమ్మకాలకు కూడా అంత ప్రాశస్త్యం ఉంది. తాజాగా జరిగిన వేలంలో ఒక నిమ్మకాయను రూ.5.90 లక్షలకు పాడి ఓ భక్తుడు సొంతం చేసుకున్నాడు. పుదుక్కోటై జిల్లా తిరువరుంగుళం వల్లనాట్టు చెట్టియార్‌ వర్గీయులు పళనిలో ఏటా మూడు రోజుల పాటు తైపూస ఉత్సవాలు నిర్వహిస్తారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అన్నదానం చేసే సమయాల్లో స్వామి పాదాల వద్ద ఒక్కొ నిమ్మకాయ పెట్టి పూజ చేస్తుంటారు. వాటిని గురువారం వేలం వేశారు. ఒక్కో నిమ్మకాయ రూ.16 వేలు నుంచి 40 వేలు వరకు పలికింది. తైపూసం రోజున మురుగన్‌ అభిషేకం సమయంలో పాదాల వద్ద ఉంచిన నిమ్మకాయను రూ.5.09 లక్షలకు ఓ భక్తుడు సొంతం చేసుకున్నారు. వేలంలో కేవలం వల్లనాట్టు చెట్టియార్లు మాత్రమే పాల్గొంటారు. దేవుడి వద్ద ఉంచిన నిమ్మకాయతో శుభాలు చేకూరుతాయని భక్తుల నమ్మకం. అందుకే పోటీపడి మరీ దక్కించుకున్నారు.


Also Read:

గుడ్ న్యూస్.. డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడో చెప్పేసిన చంద్రబాబు..

భారీ స్కామ్.. పెట్టుబడుల పేరుతో రూ.850 కోట్లకు..

For More National News and Telugu News..

Updated Date - Feb 16 , 2025 | 08:52 PM