Share News

Pahalgam Terrorists: అసలు.. దాడి చేయాలనుకున్నది ఈ మూడు చోట్ల.. 2 రోజుల ముందే పహల్గాంకు..

ABN , Publish Date - May 01 , 2025 | 04:59 PM

పహల్గాం దాడికి రెండు రోజుల ముందు నుంచే బైసరన్ లోయలో ఉగ్రవాదులు ఉన్నారని తెలుస్తోంది. వాస్తవానికి ఉగ్రవాదులు వేరే మూడు చోట్ల మారణకాండ సృష్టించాలని నిర్ణయించుకున్నారు.

Pahalgam Terrorists:  అసలు.. దాడి చేయాలనుకున్నది ఈ మూడు చోట్ల.. 2 రోజుల ముందే పహల్గాంకు..
Three other tourist spots were on hitlist

Pahalgam terrorists: ఏప్రిల్ 22న, జమ్ము కశ్మీర్ లోని పహల్గాంలో పర్యాటకులపై సాయుధ ఉగ్రవాదులు కాల్పులు జరిపిన ఘటనకు సంబంధించి సంచలన విషయాలు ఒక్కక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రమూకలు దాడికి పాల్పడ్డ పహల్గాంలోని బైసరన్ లోయకు రెండు రోజుల ముందే చేరుకున్నట్టు తెలుస్తోంది.

pahalgam-attack.jpg-1.jpg ఏప్రిల్ 22 దాడికి రెండు రోజుల ముందు బైసరన్ లోయలో ఉగ్రవాదులు ఉన్నారని కూడా నివేదిక పేర్కొంది. అంతేకాదు, వాస్తవానికి ఉగ్రవాదులు మరో మూడు చోట్ల మారణకాండ సృష్టించాలని భావించినట్టు తెలుస్తోంది.

pahalgam-attack.jpg-2.jpg1. అరు వ్యాలీ, 2. ఎమ్మూజ్ మెంట్ పార్క్, 3. బేతాబ్ వ్యాలీ ప్రదేశాలపై దాడి చేయాలని ఉగ్రవాదులు మొదట ప్రణాళిక వేసుకున్నారని నిఘా వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈ ప్రదేశాలలో భద్రతా దళాలు ఉండటం వల్ల వారి ప్రణాళిక విఫలమైందని సమాచారం.

pahalgam-attack.jpg-3.jpgబైసరన్ లోయ దాడికి సంబంధించి ఉగ్రవాదులకు నలుగురు భూగర్భ కార్మికులు (OGW) సహాయం చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించి అధికారులు దాదాపు 20 మంది OGW లను గుర్తించగా, మరికొందరిని కూడా అరెస్టు చేశారు. దాడికి సంబంధించి మొత్తంగా 186 మందిని విచారిస్తున్నారు.

Pahalgam-attack.jpg


ఇవి కూడా చదవండి

ACB Custody: విడుదల గోపిపై ఏసీబీ ప్రశ్నల వర్షం

PM Modi AP Visit: ప్రధాని మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారు

Read Latest AP News And Telugu News

Updated Date - May 01 , 2025 | 05:00 PM