Delhi: పొగమంచుతో 400 విమానాలు ఆలస్యం
ABN , Publish Date - Jan 04 , 2025 | 09:43 PM
విజిబిలిటీ సున్నా స్థాయికి పడిపోవడంతో మధ్యాహ్నం 12.15 నుంచి 1.30 గంటల వరకూ 19 విమానాలను దారిమళ్లించినట్టు అధికారులు చెప్పారు. వీటిలో 13 డొమిస్టిక్ విమానాలు, 4 అంతర్జాతీయ విమానాలు, రెండు నాన్-షెడ్యూల్డ్ విమానాలు ఉన్నట్టు తెలిపారు.

న్యూఢిల్లీ: ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడం, పొగమంచు కారణంగా ఢిల్లీలో విమాన సేవలకు తీవ్ర అంతరాయం కలిగిగింది. వరుసగా రెండోరోజైన శనివారంనాడు కూడా ఢిల్లీ విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు, విజిబిలిటీ జీరో స్థాయికి పడిపోవడంతో 400కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. 45కు పైగా విమానాలను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు.
Prashant Kishor: దీక్షా శిబిరం వద్ద లగ్జరీ వ్యాన్.. అదిరిపోయే జవాబిచ్చిన పీకే
విజిబిలిటీ సున్నా స్థాయికి పడిపోవడంతో మధ్యాహ్నం 12.15 నుంచి 1.30 గంటల వరకూ 19 విమానాలను దారిమళ్లించినట్టు అధికారులు చెప్పారు. వీటిలో 13 డొమిస్టిక్ విమానాలు, 4 అంతర్జాతీయ విమానాలు, రెండు నాన్-షెడ్యూల్డ్ విమానాలు ఉన్నట్టు తెలిపారు. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ 24.com ప్రకారం ఢిల్లీ విమానాశ్రయం నుంచి 400 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దేశంలోని అతిపెద్ద ఎయిర్‌లైన్ ఇండిగో శనివారం ఉదయం విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసింది. విమానాల సమయాల కోసం ప్రయాణికులు ఎప్పటికప్పుడు సంబంధిత ఎయిర్ లైన్లను సంప్రదించాలని ఎయిర్ పోర్ట్ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇండిగో, ఎయిర్‌ఇండియా సైతం అడ్వయిజరీలు జారీ చేశాయి.
ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ సామాజిక మాధ్యమం "ఎక్స్''లో తెలిపింది. ఢిల్లీ, చండీగఢ్, అమృత్‌సర్, శ్రీనగర్, గౌహతి, పాట్నాల్లో పట్టపగలు కూడా విజిబిలిటీ దారుణంగా పడిపోయిందని ఇండిగో తెలిపింది. వాతావరణం మెరుగుపడిన వెంటనే విమాన సేవలు పునరుద్ధరిస్తామని ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది.
ఇవి కూడా చదవండి..
Grameen Bharat Mahotsav 2025: రూరల్ ఇండియా మహోత్సవ్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
BJP: ఖర్గే రాజీనామా చేసే వరకు పోరాటం..
Read More National News and Latest Telugu News