Share News

Hyderabad: ఆపరేషన్‌ స్మైల్‌.. 4,357 మంది చిన్నారులను రక్షించిన పోలీసులు

ABN , Publish Date - Feb 01 , 2025 | 08:38 AM

మానవ అక్రమ రవాణా ముఠాల చెరలో చిక్కి దుర్భర జీవితం అనుభవిస్తున్న 4,357 మంది చిన్నారులను ఆపరేషన్‌ స్మైల్‌ ప్రాజెక్టు(Operation Smile Project)లో భాగంగా రక్షించినట్లు మహిళా భద్రతా విభాగం డిజీపీ షికాగోయల్‌ శుక్రవారం తెలిపారు.

Hyderabad: ఆపరేషన్‌ స్మైల్‌.. 4,357 మంది చిన్నారులను రక్షించిన పోలీసులు

- వారిలో 3,905 మంది తల్లిదండ్రుల చెంతకు

- ఎక్కువగా నేపాల్‌తో పాటు ఇతర రాష్ట్రాల బాలలు

హైదరాబాద్‌: మానవ అక్రమ రవాణా ముఠాల చెరలో చిక్కి దుర్భర జీవితం అనుభవిస్తున్న 4,357 మంది చిన్నారులను ఆపరేషన్‌ స్మైల్‌ ప్రాజెక్టు(Operation Smile Project)లో భాగంగా రక్షించినట్లు మహిళా భద్రతా విభాగం డిజీపీ షికాగోయల్‌ శుక్రవారం తెలిపారు. మానవ అక్రమ రవాణా, పిల్లల అపహరణ వంటి కేసులను అరికట్టేందుకు కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ప్రతి ఏటా జనవరి నెలలో ఆపరేషన్‌ స్మైల్‌ పేరిట స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నామని ఆమె వివరించారు. ఈ క్రమంలో తెలంగాణలోని వివిధ జిల్లాల్లో మొత్తం 4,357 మంది చిన్నారులను రక్షించి వారి కుటుంబాలకు అప్పగించినట్లు తెలిపారు. వారిలో 3,897 మంది బాలురు ఉండగా, 460 మంది బాలికలు ఉన్నారని వెల్లడించారు.

ఈ వార్తను కూడా చదవండి: Minister: మంత్రిగారి హెచ్చరిక.. అలాచేస్తే లైసెన్స్‌ లేకుండా చేస్తాం..


నేపాల్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు అత్యధికంగా 1,793 మంది ఉన్నారని తెలిపారు. రక్షించిన వారిలో వీధి బాలలుగా ఫుట్‌పాత్‌ల(Footpath)పై బతుకుతున్న వారు 68 మంది, భిక్షాటనలో 30 మంది, బాల కార్మికులుగా 3,940 మంది, ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న వారు 109 మంది, ఇతర పరిశ్రమల నుంచి 210 మంది ఉన్నారని ఆమె తెలిపారు. వీరిలో 422 మంది పిల్లలను దర్పణ్‌ యాప్‌(Darpan App) ద్వారా గుర్తించినట్లు చెప్పారు.


city5.jpg

వివిధ చట్టాల పరిధిలో 1,038 కేసులు నమోదు చేసి 1,040 మందిని అదుపులోకి తీసుకున్నామని షికా గోయల్‌ తెలిపారు. ఈ నెలలో దొరికిన పిల్లల్లో కేవలం 3,905 మందిని మాత్రమే తల్లిదండ్రుల వద్దకు చేర్చగలిగామని చెప్పారు. తల్లిదండ్రులు లేని 452 మంది చిన్నారులను బాలల వసతి గృహంలో చేర్పించామని ఆమె తెలిపారు. 2,698 మంది చిన్నారులు చదువు మధ్యలోనే మానేసినట్లు గుర్తించి వారి బాధ్యతలను జిల్లా పిల్లల సంరక్షణ కమిటీలకు అప్పగించి మళ్లీ వారిని బడికి పంపించడానికి చర్యలు తీసుకున్నామని షికా గోయల్‌ వెల్లడించారు.


ఈవార్తను కూడా చదవండి: Financial Survey: పన్ను వసూళ్లలో తెలంగాణ నం.1

ఈవార్తను కూడా చదవండి: ప్రయాగ్‌రాజ్‌లో నలుగురు మహిళల అదృశ్యం!

ఈవార్తను కూడా చదవండి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు.. కాంగ్రెస్‌ అభ్యర్థిగా నరేందర్‌రెడ్డి

ఈవార్తను కూడా చదవండి: ఏకంగా సచివాలయంలో నకిలీ ఉద్యోగులు హల్‌చల్

Read Latest Telangana News and National News

Updated Date - Feb 01 , 2025 | 08:38 AM