Share News

Operation Sindhoor: ఆపరేషన్ సిందూర్ చిన్న యుద్ధమా? కాంగ్రెస్‌పై సంబిత్‌పాత్ర నిప్పులు

ABN , Publish Date - May 20 , 2025 | 06:22 PM

రాహుల్ గాంధీ గత రెండ్రోజులుగా ఆధారాలున్నాయా అంటూ ప్రశ్నించడంపై సంబిత్ పాత్ర మాట్లాడుతూ, మొదటి రోజు నుంచి తాము డిజిటల్ ఆధారాలను ప్రెజెంట్ చేస్తూనే ఉన్నామని చెప్పారు.

Operation Sindhoor: ఆపరేషన్ సిందూర్ చిన్న యుద్ధమా? కాంగ్రెస్‌పై సంబిత్‌పాత్ర నిప్పులు

న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) "చిన్న యుద్ధం'' (Small War) అంటూ కాంగ్రెస్ చేస్తున్న వాదనపై భారతీయ జనతా పార్టీ (BJP) తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఆధారాల కోసం పదేపదే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తుండటం మన సాయుధ బలగాలను అవమానించడమేనని బీజేపీ సీనియర్ నేత సంబిత్ పాత్ర (Sambit Patra) అన్నారు.

Operation Sindoor: ఆధునిక యుగపు మీర్ జాఫర్.. రాహుల్‌పై బీజేపీ కౌంటర్ అటాక్


''మన సాయుధ బలగాలు పాకిస్థాన్‌లోకి ప్రవేశించి అక్కడి 9 ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసి, 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టిన విషయం రాహుల్, ఖర్గేకు అర్ధం కాలేదా? పాకిస్థాన్ దాడులకు దిగడంలో అక్కడి 11 ఎయిర్‌బేస్‌లను భారత్ ధ్వంసం చేసింది. ఇవాళ ఆ నొప్పితో పాక్ విలవిల్లాడుతోంది. ఇంత జరిగితే ఇవాళ ఆపరేషన్ సిందూర్‌ను చిన్న యుద్ధమంటూ వాళ్లు (ఖర్గే, రాహుల్) చెబుతున్నారు. ఇది దేశాన్ని, మన సాయుధ బలగాల సాహసాలను వంచించడమే అవుతుంది'' అని సంబిత్ పాత్ర అన్నారు.


రాహుల్ గాంధీ గత రెండ్రోజులుగా ఆధారాలున్నాయా అంటూ ప్రశ్నించడంపై సంబిత్ పాత్ర మాట్లాడుతూ, మొదటి రోజు నుంచి తాము డిజిటల్ ఆధారాలను ప్రెజెంట్ చేస్తూనే ఉన్నామని చెప్పారు. అయినప్పటికీ సాయుధ బలగాల సాహసాన్ని రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారని, ఆయన, ఆయన పార్టీ నేతలు పాకిస్థాన్ పోస్టర్ బాయ్స్‌గా మారడటమే దీనికి కారణమని కౌంటర్ ఇచ్చారు.


ఇవి కూడా చదవండి..

Shashi Tharoor: ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెబుతూ ఎంపీ శశి థరూర్ లేఖ

Jyoti Malhotra Case: జ్యోతి మల్హోత్రా కేసులో కీలక అప్‎డేట్..యాంటీ టెర్రర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 20 , 2025 | 06:35 PM