Delhi Vehicle Pollution Policy: ఒత్తిడికి తలొగ్గిన ఢిల్లీ సర్కార్.. ఆ విషయంలో యూటర్న్..
ABN , Publish Date - Jul 03 , 2025 | 06:39 PM
Delhi New Fules for Old Vehicles: పాత వాహనాలకు ఇంధన నిషేధంపై ఢిల్లీ సర్కార్ యూటర్న్ తీసుకుంది. కాలుష్యానికి కారణమవుతున్న వాహనాలకు సంబంధించిన కీలక నిర్ణయాన్ని అనూహ్యంగా వెనక్కి తీసుకుంది. ఈ మేరకు ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM)కి లేఖ రాశారు.
Delhi Government Vehicle Decision: పాత వాహనాలకు ఇంధన నిషేధంపై ఢిల్లీ ప్రభుత్వం యూ-టర్న్ తీసుకుంది. కాలం చెల్లిన వాహనాలకు జులై 1వ తేదీ నుంచి పెట్రోల్ లేదా డీజిల్ సరఫరా నిలిపివేయాలని జారీ చేసిన ఉత్తర్వును వెనక్కితీసుకుంది. దేశరాజధానిని కాలుష్య కాసారంలా మార్చేస్తున్న వాహనాలపై నిషేధం సాధ్యం కాదంటూ చేతులెత్తేసింది. 15 ఏళ్లు నిండిన వాహనాలకు ఇంధనం బ్యాన్ చేయడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో.. ఒత్తిడికి తలొగ్గిన ఢిల్లీ సర్కార్ ఈ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ (CAQM)కి ఒక లేఖ రాశారు. రాజధానిలో కాలం చెల్లిన వాహనాలకు ఇంధన అమ్మకాలను నిషేధించే ఉత్తర్వును ప్రస్తుతానికి నిలిపివేయాలని ఆయన కోరారు.
దేశరాజధానికి పొగపెడుతున్న కాలం చెల్లిన వాహనాలు రోడ్లపై తిరగకుండా తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం అమలులో వెనకడుగు వేసింది ఢిల్లీ ప్రభుత్వం. జులై ఒకటో తేదీ నుంచి 15 ఏళ్లు నిండిన వాహనాలకు ఇంధన సరఫరాను నిరాకరిస్తూ ఉత్తర్వు జారీ చేసిన ప్రభుత్వం.. ఢిల్లీలో దాదాపు 350 పెట్రోల్ బంకుల్లో సీసీ కెమెరాలు సౌండ్ సిస్టం ఏర్పాటు చేసింది. గడువుతేదీ ముగిసిన వాహనం పెట్రోల్ బంక్ సమీపంలోకి రాగానే దాని నెంబర్ ప్లేట్‌ను స్కాన్ చేసుకొని అలారం మోగుతుంది. ఈ కారణంగా దేశరాజధానిలో సుమారు 62 లక్షల వాహనాలు మూలనపడే అవకాశముంది. ఈ విషయమై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబికడంతో ఇంధన బ్యాన్ అసాధ్యమంటూ ఆఘమేఘాల మీద నిర్ణయాన్ని వెనక్కితీసుకున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి
తెలంగాణ నీటి వాటాను ఏపీకి దారాదత్తం చేశారు.. కేసీఆర్, హరీష్‌లపై మహేష్ గౌడ్ ఫైర్
వరంగల్ ఇష్యూ.. మీనాక్షికి నివేదిక ఇచ్చిన కొండా దంపతులు
Read latest Telangana News And Telugu News