PM Modi: ప్రధాని మోదీతో అజిత్ దోవల్ భేటీ..
ABN , Publish Date - May 06 , 2025 | 01:46 PM
పహల్గామ్ ఉగ్రవాద దాడికి భారత ప్రభుత్వం ఎలాంటి ప్రతీకారం తీర్చుకుంటుందోనని ఉద్రిక్తత కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమావేశమయ్యారు.
న్యూఢిల్లీ, మే 06: పహల్గామ్ ఉగ్రవాద దాడికి భారత ప్రభుత్వం ఎలాంటి ప్రతీకారం తీర్చుకుంటుందోనని ఉద్రిక్తత కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమావేశమయ్యారు. ఈ బేటీలో యుద్ధ సన్నద్ధతకు సంబంధించిన వివరాలను ప్రధాని నరేంద్ర మోదీకి దోవల్ వివరించారు. గడిచిన 48 గంటల్లో ప్రధానమంత్రికి NSA వివరణ ఇవ్వడం ఇది రెండోసారి. ప్రధానంగా మాక్ సెక్యూరిటీ డ్రిల్స్‌కి సంబంధించి అంశంపై చర్చించారు.