Share News

OIC-Pak: భారత్‌కు దౌత్య విజయం.. పాక్‌ ఆశించిన మద్దతు ఇవ్వని ఇస్లామిక్ దేశాలు

ABN , Publish Date - May 11 , 2025 | 11:02 PM

పహల్గాం దాడి తరువాత పాక్ ఒంటరైందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇస్లామిక్ దేశాల కూటమి నుంచి కూడా పాక్ కు ఆశించిన మద్దతు రాకపోవడంతో దయాది దేశానికి శరాఘాతంగా మారిందని చెబుతున్నారు.

OIC-Pak: భారత్‌కు దౌత్య విజయం.. పాక్‌ ఆశించిన మద్దతు ఇవ్వని ఇస్లామిక్ దేశాలు
Pakistan Islamic support

ఇంటర్నెట్ డెస్క్: ఇస్లామిక్ దేశాలన్నీ తనకు మద్దతుగా ఉంటాయని చెప్పుకునే పాకిస్థాన్.. పహల్గాం దాడి తరువాత దాదాపుగా ఒంటరిగా మారిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇస్లామిక్ దేశాల కూటమి ఓఐసీ నుంచి కూడా పాక్‌కు ఆశించిన స్థాయిలో మద్దతు రాలేదని తెలుస్తోంది. పహల్గాం తరువాత కొన్ని రోజులకు కానీ ఓఐసీ ప్రకటన విడుదల చేయలేదు. చివరకు విడుదలైన ప్రకటనలో కూడా పాక్ ఆశించిన మద్దతు కనిపించలేదు. ఏదో ప్రకటన చేయాలని కాబట్టి చేశామనట్టు ఓఐసీ ప్రకటన ఉండటం పాక్‌కు షాక్ కొట్టినట్టు అయ్యిందట.

‘‘ఓఐసీ గ్రూప్‌లో చాలా అంతర్మథనం జరిగింది. పాక్‌కు చుక్కలు కనిపించాయి. ఇస్లామిక ప్రపంచమంతా తమ వెంటే ఉన్నట్టు వారు చెప్పుకుంటారు కానీ ఈసారి మాత్రం అలాంటి విస్పష్ట మద్దతు ఏదీ కనిపించలేదు’’ అని సంబంధిత వర్గాలు వ్యాఖ్యానించాయి.


భారత్ పరిస్థితి సౌదీ అరేబియాను కదిలించిందని కొందరు చెబుతున్నారు. సౌదీ పర్యటనలో ప్రధాని ఉండగానే పహల్గాం దాడి జరిగింది. దీంతో, ప్రధాని మధ్యలో తన పర్యటన ముగించుకుని వెనక్కు తిరిగి రావాల్సి వచ్చింది. మలేషియా కూడా పహల్గాం దాడిని ఖండిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘పాక్‌కు మద్దతుగా ఇస్లామిక్ దేశాలు పూర్తిస్థాయిలో ముందుకు రాలేదు. అంతా తన వెంటే ఉన్నారని పాక్ చెప్పుకుంటూ ఉంటుంది. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది’’ అని చెబుతున్నారు.


ప్రస్తుతం భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, భద్రతా దళాలు మాత్రం అప్రమత్తంగా ఉంటున్నాయి. రేపు ఇరు దేశాల సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్స్ సమావేశం కావాల్సి ఉంది. ఇక కాశ్మీర్ విషయంలో ఏ దేశం జోక్యాన్ని తాము ఆమోదించబోమని భారత్ గతంలోనే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రేపు జరగనున్న చర్చలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

ఇవి కూడా చదవండి:

కృష్ణబిలంలో పడి నక్షత్రం ధ్వంసం.. అద్భుత ఫొటో షేర్ చేసిన నాసా

ఈ విషయాల్లో ప్రపంచానికంటే భారత్ బెటరంటున్న అమెరికా మహిళ

పాక్ మిలిటరీ స్థారవరాలపై భారత్ వైమానిక దాడులు.. షాకింగ్ పిక్చర్స్

Read Latest and National New

Updated Date - May 11 , 2025 | 11:04 PM