Nitin Gadkari: మోసం చేయగలిగేవాడే గొప్ప నేత
ABN , Publish Date - Sep 02 , 2025 | 01:46 AM
తాను ఉన్న రాజకీయ రంగంలో హృదయాంతరాల్లోంచి నిజాలు మాట్లాడటంపై నిషేధం ఉందని, ఈ రంగంలో ప్రజలను మోసం చేయగలిగే వాడే నేతల్లోకెల్లా గొప్ప నేత అనిపించుకుంటాడని బీజేపీ సీనియర్ నాయకుడు
రాజకీయాల్లో నిజాలు మాట్లాడటంపై నిషేధం ఉంది: గడ్కరీ
న్యూఢిల్లీ, సెప్టెంబరు 1: తాను ఉన్న రాజకీయ రంగంలో హృదయాంతరాల్లోంచి నిజాలు మాట్లాడటంపై నిషేధం ఉందని, ఈ రంగంలో ప్రజలను మోసం చేయగలిగే వాడే నేతల్లోకెల్లా గొప్ప నేత అనిపించుకుంటాడని బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. నాగపూర్‌లో సోమవారం అఖిల భారతీయ మహానుభావ పరిషత్ నిర్వహించిన కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడారు. బతకడానికి దగ్గరిదారులు (షార్ట్‌కట్స్) వెతకొద్దని.. నిబద్ధత, నిజాయితీ, విశ్వసనీయతతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. దగ్గరిదారులు సత్వర ఫలితాలు ఇవ్వొచ్చునేమో గానీ, దీర్ఘకాలంలో విశ్వసనీయతను దెబ్బతీస్తాయని హెచ్చరించారు. విజయం ఎప్పుడూ సత్యం వెంటే ఉంటుందని, భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా ఎప్పుడైనా చివరికి సత్యమే గెలుస్తుందని చెప్పాడని పేర్కొన్నారు.
ఉపరాష్ట్రపతి నివాసం ఖాళీ చేసిన ధన్‌ఖడ్
న్యూఢిల్లీ, సెప్టెంబరు 1: మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి, దక్షిణ ఢిల్లీలోని ఛతర్‌పూర్ ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేటు ఫామ్‌హౌ్‌సకు మారారు. తన పదవికి రాజీనామా చేసిన ఆరు వారాల తరువాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఛతర్‌పూర్‌లోని గడైపూర్ ప్రాంతంలో ఉన్న ఈ ఫామ్‌హౌస్ ఐన్‌ఎల్‌డీ నాయకుడు అభయ్ చౌతాలాకు చెందినది. మాజీ ఉపరాష్ట్రపతిగా ఆయనకు కేటాయించాల్సిన టైప్-8 అధికారిక నివాసం లభించే వరకు ఇది తాత్కాలిక ఏర్పాటు అని అధికారులు తెలిపారు. ఆరోగ్య సమస్యలున్నాయని జూలై 21న తన పదవికి రాజీనామా చేసిన ధన్‌ఖడ్, అప్పటి నుంచి పార్లమెంటుహౌస్ దగ్గర్లో వైస్ ప్రెసిడెంట్ ఎన్‌క్లేవ్‌లో ఉంటున్నారు.
ఇవి కూడా చదవండి..
ఒకే కారులో ప్రయాణించిన మోదీ, పుతిన్
ఎస్‌సీఓ సమిట్‌లో ప్రత్యేక ఆకర్షణగా మోదీ, పుతిన్ బంధం..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి