Nipah Virus Outbreak: భయపెడుతున్న నిఫా వైరస్.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ABN , Publish Date - Jul 07 , 2025 | 11:39 AM
నిఫా వైరస్ మరోమారు కలకలం రేపుతోంది. దీంతో వైరస్ వ్యాప్తి మీద నిఘాను మరింత పెంచాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. వైద్యాధికారులను అప్రమత్తం చేశారు ఆరోగ్య శాఖ మంత్రి.
కేరళలో నిఫా వైరస్ మళ్లీ కలకలం సృష్టిస్తోంది. ప్రమాదకర వైరస్ అక్కడి ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. నిఫా వైరస్ సోకి ఈ నెల 1వ తేదీన కోజీకోడ్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఒక వ్యక్తి మరణించారు. పాలక్కాడ్ ప్రాంతానికి చెందిన 39 సంవత్సరాల మహిళకు కూడా ఈ వైరస్ సోకింది. వైద్య పరీక్షల సమయంలో నిఫా లక్షణాలు కనిపించడంతో ఆమె నమూనాలను పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించారు. అక్కడి ప్రయోగశాలలో వీటిని పరీక్షించగా నిఫా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో వైరస్ వ్యాప్తి మీద మరింత నిఘా పెంచాలని రాష్ట్ర వ్యాప్తంగా వైద్యాధికారులకు ఆదేశించారు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్. ప్రస్తుత పరిస్థితులు, వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని కొన్ని గైడ్‌లైన్స్‌లు విడుదల చేసింది రాష్ట్ర సర్కారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

లక్షణాలు కనిపిస్తే..
వైరస్ సోకిన వాళ్లు తప్పనిసరిగా క్వారంటైన్ నిబంధనల్ని పాటించాలని కోరింది కేరళ ప్రభుత్వం. ఎప్పటికప్పుడు చేతుల్ని శానిటైజర్లతో శుభ్రం చేసుకోవాలని స్పష్టం చేసింది. ఒకవేళ జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి లాంటి లక్షణాలు వచ్చినా.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తినా వెంటనే హెల్త్ వర్కర్స్‌కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. నిఫా వైరస్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయని, రాష్ట్రంలో 425 మందిపై నిఘా ఉంచామని ఆమె తెలిపింది. వీరిలో 228 మంది మలప్పురం, 110 మంది పాలక్కడ్, 87 మంది కోజికోడ్ జిల్లాకు చెందిన వారు ఉన్నారని వీణా జార్జ్ వెల్లడించారు.

మాస్కులు తప్పనిసరి..
ప్రభుత్వ నిఘాలో ఉన్నవారిలో 12 మంది రోగులకు మలప్పురంలో చికిత్స అందుతోందని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ఇందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందన్నారు. వీళ్లను ఐసీయూలో ఉంచి ట్రీట్‌మెంట్ అందిస్తున్నామని పేర్కొన్నారు. కోజికోడ్ నుంచి 87 మంది హెల్త్ వర్కర్స్, పాలక్కడ్‌కు చెందిన 61 మంది హెల్త్ వర్కర్స్‌పై నిఘా ఉంచామని తెలిపారు వీణా జార్జ్. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అన్ని 108 అంబులెన్స్‌లను అలర్ట్ మోడ్‌లో పెట్టామని చెప్పుకొచ్చారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వైరస్ కంటెయిన్‌మెంట్ జోన్‌లో గుంపులు గుంపులుగా తిరగడం లాంటివి చేయొద్దన్నారు. ప్రయాణాల సమయంలో ఎన్95 మాస్కులు తప్పనిసరిగా ధరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి:
ప్రేమ పెళ్లి.. ప్రతీ రోజూ గొడవలే.. కట్ చేస్తే.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి