Share News

RSS Chief on Age Limit: 75 ఏళ్లకు పదవీ విరమణ లేనే లేదు: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్

ABN , Publish Date - Aug 28 , 2025 | 09:58 PM

సెప్టెంబర్‌లో తన 75వ పుట్టినరోజు తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ 'పదవీ విరమణ' చేస్తారనే ఊహాగానాలు నేపథ్యంలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టత నిచ్చారు. 75 ఏళ్లకు పదవీ విరమణ చేయాలని ఎవరూ, ఎప్పుడూ చెప్పలేదే అని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నేడు ఢిల్లీలో తేల్చి చెప్పారు.

RSS Chief on Age Limit: 75 ఏళ్లకు పదవీ విరమణ లేనే లేదు: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్
RSS Chief Mohan Bhagwat On 75 Year Age Limit

న్యూఢిల్లీ, ఆగస్టు 28: పదవీ విరమణ 75 ఏళ్లకు చేయాలనే నిబంధనపై అనేక ఊహాగానాల నడుమ ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇవాళ(గురువారం) స్పష్టతనిచ్చారు. సెప్టెంబర్‌లో తన 75వ పుట్టిన రోజు తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 'పదవీ విరమణ' చేస్తారనే ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. 75 ఏళ్లకు పదవీ విరమణ చేయాలని ఎవరూ, ఎప్పుడూ చెప్పలేదే అని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నేడు ఢిల్లీలో తేల్చి చెప్పారు.


బీజేపీ, ఆ పార్టీ సైద్ధాంతిక గురువైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌(ఆర్ఎస్ఎస్) లోని అప్రకటిత 'నియమం' ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీ 75 ఏళ్ల వయసు దాటిన తర్వాత రాజీనామా చేస్తారనే ఊహాగానాలను ఆర్‌ఎస్‌ఎస్ బాస్ తోసిపుచ్చారు.

ప్రధాని నరేంద్రమోదీకి సెప్టెంబర్ 17వ తేదీ నాటికి 75 ఏళ్లు నిండుతాయి. ఈ నేపథ్యంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు 'నేను పదవీ విరమణ చేస్తానని, లేదా 75 ఏళ్లు నిండినప్పుడు మరొకరు పదవీ విరమణ చేయాలని నేనెప్పుడూ చెప్పలేదు' అని ఆయన అన్నారు. 'సంఘ్ మాకు ఏమి చెబుతుందో మేము అదే చేస్తాము' అని ఆర్‌ఎస్‌ఎస్ 100వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా చెప్పారు.


ఇవి కూడా చదవండి

ఏడేళ్ల తర్వాత చైనాకు మోదీ.. ఇక అమెరికాకు మామూలుగా ఉండదు..

రీల్ కోసం సాహసం.. కదులుతున్న రైలుకు వెలాడుతూ వీడియో తీస్తుంటే.. షాక్..

Updated Date - Aug 28 , 2025 | 10:11 PM