Share News

Bharath New Vice President: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే గెలుపు, భారత ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌ ఎన్నిక..

ABN , Publish Date - Sep 09 , 2025 | 05:57 PM

భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే కూటమికే గెలుపు సొంతమైంది. ఈ మేరకు భారత నూతన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ ఎన్నికయ్యారు. ఇండీ కూటమి నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసిన బి.సుదర్శన్‌రెడ్డి ఈ ఎన్నికల్లో ఓడిపోయారు.

Bharath New Vice President: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే గెలుపు, భారత ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌ ఎన్నిక..
New Vice President

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే కూటమికే గెలుపు సొంతమైంది. నూతన ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌ భారీ విజయం సాధించారు. ఇండీ కూటమి నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసిన బి.సుదర్శన్‌రెడ్డి(Sudershan Reddy) ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ(మంగళవారం) భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ఈ సాయంత్రం 5 గంటలకు ముగియగా, ఓట్ల లెక్కింపు అనంతరం రాత్రి 7:30 గంటలకు ఫలితాలు వెలువరించారు.

ఎన్డీయే కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌(CP Radhakrishnan)కు 452 ఓట్లు రాగా.. ఇండీ కూటమి అభ్యర్థి జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్ 152 ఓట్ల మెజారిటీతో భారీ విజయం సాధించారు. మొత్తంగా 781 అర్హులైన ఎంపీలలో 767 మంది ఓటు వేశారు. కాగా.. ఈ ఎన్నికల్లో 98.2 ఓటింగ్ శాతం నమోదైంది. మరోవైపు కొంతమంది ప్రతిపక్ష ఎంపీలు క్రాస్-ఓటింగ్ కు పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీలో చీలికలు ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించాయి.

VP Election 1.jpg


దీంతో ఎన్డీఏ అభ్యర్థి, ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్(Maharashtra governor) సీపీ రాధాకృష్ణన్ భారతదేశ 15వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనట్లు అయ్యింది. ఆయన, తన ప్రత్యర్థి ఇండియా బ్లాక్ అభ్యర్థి బి.సుదర్శన్ రెడ్డిని సునాయాసంగా ఓడించారు. మొత్తం 767 ఓట్లలో రాధాకృష్ణన్ ఏకంగా 452 ఓట్లు సాధించి ప్రత్యర్థిని చిత్తు చేశారు. కాగా.. ఈ ఎన్నికల్లో 752 ఓట్లు చెల్లుబాటు అవగా.. 15 చెల్లని ఓట్లు నమోదయ్యాయని రిటర్నింగ్ అధికారి పీసీ మోడీ(Returning Officer PC Mody) విలేకరుల సమావేశంలో ప్రకటించారు.


  • మొత్తం ఓట్లు.. 781

  • విజయానికి కావాల్సిన ఓట్లు.. 377

  • ఎన్నికల్లో ఓటు వేయని ఎంపీలు.. 14 మంది

  • మొత్తం పోలైన ఓట్లు.. 767 మంది

  • ఎన్డీయే అభ్యర్థికి వచ్చిన ఓట్లు.. 452

  • ఇండీ కూటమి అభ్యర్థికి వచ్చిన ఓట్లు.. 300

  • ఎన్డీయే అభ్యర్థి మెజార్టీ.. 152 ఓట్లు

  • చెల్లని ఓట్లు.. 15

  • చెల్లుబాటైన ఓట్లు .. 752


VP Election 2.jpg


ఈ వార్తలు కూడా చదవండి..

యూరియాపై వైసీపీది అసత్య ప్రచారం.. మంత్రి సుభాష్ ఫైర్

ఆ ఐపీఎస్‌లకు మళ్లీ షాక్ ఇచ్చిన ప్రభుత్వం

For More AP News And Telugu News

Updated Date - Sep 09 , 2025 | 09:55 PM