Share News

Amit shah: తమిళనాడులో వచ్చేది ఎన్డీయే ప్రభుత్వమే... స్పష్టత ఇచ్చిన అమిత్‌షా

ABN , Publish Date - Jun 27 , 2025 | 09:02 PM

అన్నాడీఎంకే-బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఏర్పాటు ఏ విధంగా ఉండబోతోందని అడిగిన ఒక ప్రశ్నకు ద్రవిడ పార్టీ నుంచే ముఖ్యమంత్రి ఉంటారని నేరుగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె.పళనిస్వామి పేరును ప్రస్తావించకుండా అమిత్‌షా సమాధానమిచ్చారు.

Amit shah: తమిళనాడులో వచ్చేది ఎన్డీయే ప్రభుత్వమే... స్పష్టత ఇచ్చిన అమిత్‌షా

చెన్నై: తమిళనాడు (Tamil Nadu) లో తదుపరి ప్రభుత్వాన్ని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) ఏర్పాటు చేస్తుందని, 2026 అసెంబ్లీ ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉంటుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit shah) తెలిపారు. అన్నాడీఎంకే ఆధ్వర్యంలోనే ఎన్నికలకు వెళ్తామని 'దినమలర్'‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన స్పష్టం చేశారు.


సీఎం ఏ పార్టీ నుంచంటే..

అన్నాడీఎంకే-బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఏర్పాటు ఏ విధంగా ఉండబోతోందని అడిగిన ఒక ప్రశ్నకు ద్రవిడ పార్టీ నుంచే ముఖ్యమంత్రి ఉంటారని నేరుగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె.పళనిస్వామి పేరును ప్రస్తావించకుండా అమిత్‌షా సమాధానమిచ్చారు. 'అన్నాడీఎంకే నిశ్చయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అందులో బీజేపీ ఉంటుంది' అని స్పష్టత ఇచ్చారు. తమిళనాడు బీజేపీ నేత అన్నామలై రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర విహిస్తున్నారని, జాతీయ స్థాయిలో బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు.


విజయ్ పార్టీ గురించి

నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం ఎన్డీయేలో చేరే అవకాశంపై అడిగినప్పుడు ఎన్నికలకు చాలా సమయం ఉందని అమిత్‌షా సమాధానమిచ్చారు. సరైన సమయంలో ఒక నిర్దిష్ట రూపం వస్తుందని చెప్పారు.


కాగా, తమిళనాడు ప్రజలు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఒప్పుకోరనే అభిప్రాయంతో పలువురు అన్నాడీఎంకే నేతలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అమిత్‌షానే స్పష్టత ఇస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు. అన్నాడీఎంకే సీనియర్ నేతలు దీనిపై పెదవి విప్పనప్పటికీ, ద్వితీయ శ్రేణి నేతలు మాత్రం పళనిస్వామికి సమర్థనగా మాట్లాడుతున్నారు. తమిళనాడులో ఎన్డీయేకు పళనిస్వామినే లీడర్ అని, ఆయన నిర్ణయమే ఫైనల్ అని చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి..

3 రాష్ట్రాల్లో బీజేపీ సంస్థాగత ఎన్నికల అధికారుల నియామకం

సీఎం కాన్వాయ్‌లోని 19 కార్లు ఒకేసారి బ్రేక్‌డౌన్.. ఎందుకంటే

For More National News

Updated Date - Jun 27 , 2025 | 09:17 PM