NDA Seat Sharing: బిహార్ ఎన్నికలు.. కొలిక్కొచ్చిన ఎన్డీయే కూటమి సీట్ల పంపకం
ABN , Publish Date - Oct 09 , 2025 | 08:22 PM
బిహార్‌లో ఎన్డీయే కూటమి పక్షాల మధ్య సీట్ల పంపంకం దాదాపుగా ఓ కొలిక్కొచ్చింది. అక్టోబర్ 12న ఎన్డీయే పార్టీలు సంయుక్తంగా అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం.
ఇంటర్నెట్ డెస్క్: త్వరలో బిహార్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్డీయే కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. అక్టోబర్ 13న ఎన్డీయే పార్టీలు అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. కూటమి పక్షాల మధ్య సీట్ల పంపకం విషయంలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని ఎన్డీయే వర్గాలు తెలిపాయి. బీజేపీ, జనతాదళ్ (యూ), లోక్ జనశక్తి పార్టీ, హిందుస్థానీ అవామ్ మోర్చా, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ సంయుక్తంగా అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నాయి. ఈసారి సీట్ల పంపిణీ బాధ్యతను ఎన్డీయే పక్షాలు జేడీ(యూ)కు అప్పగించాయి. చిరాగ్ పాస్వాన్, జితన్ రామ్ మాంఝీ, ఉపేంద్ర కుష్వాహాతో చర్చలు జరిపే బాధ్యతను కూడా జేడీయూ తీసుకుంది. ప్రస్తుతం చర్చలు సానుకూల వాతావరణంలో జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి (Bihar NDA Seat Allocation).
మరోవైపు, ఎన్నికల ఏర్పాట్లను బీజేపీ దాదాపుగా పూర్తి చేసింది. అక్టోబర్ 12న పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కూడా సమావేశం కానుంది. ప్రతి నియోజక వర్గానికి సంబంధించి ముగ్గురు అభ్యర్థులతో కూడిన జాబితాను ఇప్పటికే సిద్ధం చేశారు. వీటిపై ఢిల్లీలో చర్చ అనంతరం తుది అభ్యర్థులతో కూడిన జాబితాను ఖరారు చేస్తారు. తొలుత ఢిల్లీలో అక్టోబర్ 11న రాష్ట్రానికి చెందిన పార్టీ కోర్ గ్రూప్ సమావేశం జరుగుతుంది. ఆ మరుసటి రోజు పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, ఇతర సీనియర్ నేతలు హాజరు కానున్నారు.
ఇవి కూడా చదవండి:
మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులు.. కర్ణాటక కేబినెట్ ఆమోదం
ఐపీఎస్ ఆఫీసర్ ఆత్మహత్య.. డీజీపీ విషయంలో హర్యానా కీలక నిర్ణయం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి