Share News

Mumbai Vinayaka Mandapam: వినాయక మండపానికి రూ.474కోట్ల బీమా

ABN , Publish Date - Aug 23 , 2025 | 03:06 AM

గణపతి నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ముంబైలో జీఎ్‌సబీ సేవా మండల్‌ ఏర్పాటు చేసిన వినాయక మండపానికి ఏకంగా ...

Mumbai Vinayaka Mandapam: వినాయక మండపానికి రూ.474కోట్ల బీమా

  • ముంబైలోని సియాన్‌ ప్రాంతంలో మండపం

ముంబై, ఆగస్టు 22: గణపతి నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ముంబైలో జీఎ్‌సబీ సేవా మండల్‌ ఏర్పాటు చేసిన వినాయక మండపానికి ఏకంగా రూ.474.46కోట్ల బీమా చేయించారు. సియాన్‌ ప్రాంతంలోని కింగ్స్‌ సర్కిల్‌లో ఈ వినాయక మండపాన్ని నిర్మించారు. ఇక్కడి వినాయకుడిని 69కిలోల బంగారం, 336కిలోల వెండి ఆభరణాలతో పాటు భక్తులు సమర్పించిన ఖరీదైన వస్తువులతో అలంకరించారు. అందుకే ఇంత భారీ మొత్తంలో బీమా చేయించారు. ఇందులో రూ.67కోట్లు ఆభరణాలకు, రూ.375కోట్లు పూజారులు, మండప సిబ్బందికి ప్రమాద బీమా కింద, రూ.30కోట్లు మండపం, తదితర ఏర్పాట్లకు సంబంధించిన నిర్మాణాలకు ఇన్సూరెన్స్‌ చేయించారు. కింగ్స్‌ సర్కిల్‌లో 71ఏళ్లుగా వినాయక మండపాన్ని ఏర్పాటు చేస్తున్నారు. గతేడాది కూడా ఈ మండపానికి రూ.400.58కోట్ల బీమా తీసుకున్నారు.


ఇవి కూడా చదవండి..

చట్టంగా మారిన ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు

వెబ్ సిరిస్‌లో మోదీ మాజీ బాడీగార్డ్

For More National News And Telugu News

Updated Date - Aug 23 , 2025 | 03:06 AM