Share News

PM Modi Visit: ఈ నెలాఖరులో చైనాకు ప్రధాని మోదీ

ABN , Publish Date - Aug 07 , 2025 | 03:52 AM

దాదాపు ఏడేళ్ల తర్వాత ప్రధాని మోదీ ఈ నెలాఖరులో చైనాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. సంబంధిత

PM Modi Visit: ఈ నెలాఖరులో చైనాకు ప్రధాని మోదీ

  • గాల్వాన్‌ ఘర్షణల తర్వాత తొలిసారి

  • రెండు దేశాల పర్యటనలో భాగంగా తొలుత జపాన్‌కు, తర్వాత చైనాలో జరిగే ఎస్‌సీవోకి

న్యూఢిల్లీ, ఆగస్టు 6: దాదాపు ఏడేళ్ల తర్వాత ప్రధాని మోదీ ఈ నెలాఖరులో చైనాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. సంబంధిత వర్గాలు తెలియజేసిన వివరాల ప్రకారం.. మోదీ రెండు దేశాల పర్యటనలో భాగంగా మొదట ఆగస్టు 29న జపాన్‌ వెళ్తారు. అక్కడ ఇరుదేశాల వార్షిక సదస్సులో జపాన్‌ ప్రధానితో సమావేశం అవుతారు. అనంతరం చైనాలో పర్యటిస్తారు. తియాంజిన్‌ వేదికగా ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 1 వరకు జరగనున్న షాంఘై సహకార సంఘం(ఎ్‌ససీవో) వార్షిక సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉంది. గతేడాది రష్యాలోని కజాన్‌లో జరిగిన బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సులో చివరిసారిగా జిన్‌పింగ్‌తో మోదీ భేటీ అయ్యారు. తూర్పు లద్దాఖ్‌లోని గాల్వాన్‌లో సరిహద్దు ఘర్షణల తర్వాత ప్రధాని మోదీ చైనాలో చేయబోయే తొలి పర్యటనగా ఇది నిలవనుంది. కాగా, రానున్న ఎస్‌సీవో సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోదీ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలును వ్యతిరేకిస్తూ భారత్‌పై ట్రంప్‌ భారీగా సుంకాలు విధించిన నేపథ్యంలో మోదీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఊటీలో పర్యాటక ప్రాంతాల మూసివేత.. కారణం ఏంటంటే..

అమిత్‌షాపై పరువునష్టం వ్యాఖ్యలు.. రాహుల్‌కు బెయిల్

Read Latest Telangana News and National News

Updated Date - Aug 07 , 2025 | 03:52 AM