Share News

PM Modi: ఉపాధి కల్పనకు కట్టుబడి ఉన్నాం

ABN , Publish Date - Jul 13 , 2025 | 03:44 AM

ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో ఉపాధి కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, గత 11ఏళ్లలో దేశం అన్నిరంగాల్లో పురోగతి సాధించిందని ప్రధాని మోదీ అన్నారు...

PM Modi: ఉపాధి కల్పనకు కట్టుబడి ఉన్నాం

  • రోజ్‌గార్‌ మేళాలో 51వేల మందికి ఉద్యోగ పత్రాలు

న్యూఢిల్లీ, జూలై 12: ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో ఉపాధి కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, గత 11ఏళ్లలో దేశం అన్నిరంగాల్లో పురోగతి సాధించిందని ప్రధాని మోదీ అన్నారు. రోజ్‌గార్‌ మేళాలో భాగంగా.. ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఎంపికైన 51వేల మందికి శనివారం ప్రధాని వర్చువల్‌గా ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. అనంతరం ప్రసంగించిన మోదీ.. ప్రైవేట్‌ రంగంలో మొదటిసారి ఉద్యోగం పొందినవారికి మొదటి నెల జీతానికి తోడ్పాటుగా.. రూ.15 వేలు ప్రోత్సాహకంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మోదీ చెప్పారు. ఇందుకోసం ఉద్యోగుల ప్రోత్సాహక పథకం కింద బడ్జెట్‌లో లక్ష కోట్లు కేటాయించామన్నారు. రోజ్‌గార్‌ మేళా ద్వారా ఇప్పటివరకు 10 లక్షల నియామక పత్రాలు పంపిణీ చేశామని ప్రధాని తెలిపారు.

Updated Date - Jul 13 , 2025 | 03:44 AM