Voter Adhikar Yatra In Bihar: సోదరితో బిహార్‌కు బయలుదేరిన సీఎం స్టాలిన్
ABN , Publish Date - Aug 27 , 2025 | 11:38 AM
ఎంపీ రాహుల్ గాంధీకి మద్దతుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిహార్‌లో పర్యటించడంపై జన సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ స్పందించారు. ఇంతకీ రేవంత్ రెడ్డి ఎవరని ఆయన ప్రశ్నించారు. బిహార్ రాష్ట్రంతో ఆయన ఏం పని అంటూ రేవంత్ రెడ్డిని నిలదీశారు.
చెన్నై. ఆగస్టు 27: బిహార్‌లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార్ యాత్రకు డీఏంకే పార్టీ అధినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సంఘీభావం ప్రకటించారు. అందులో భాగంగా బుధవారం రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార్ యాత్రలో సీఎం స్టాలిన్ పాల్గొనున్నారు. అందుకోసం చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో సీఎం స్టాలిన్‌తో పాటు ఆయన సోదరి, ఎంపీ కనిమొళి బిహార్ వెళ్లారు. బుధవారం సాయంత్రం దర్భంగాలో భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో వీరు పాల్గొంటారు. ఈ ర్యాలీలో రాహుల్ యాత్రకు సీఎం స్టాలిన్.. తన సంఘీభావం ప్రకటించనున్నారు.
మరోవైపు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం రాహుల్ గాంధీతో కలిసి ఓటర్ అధికార్ యాత్రలో పాల్గొన్న సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డితోపాటు తెలంగాణకు చెందిన పలువురు అగ్రనేతలు సైతం.. ఈ రాహుల్ యాత్రలో పాల్గొని తమ సంఘీభావం తెలియజేశారు. ఆ మరునాడే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్.. రాహుల్ గాంధీ చేపట్టిన యాత్రలో పాల్గొనుండడం గమనార్హం.
బిహార్‌లో లక్షలాది ఓట్లు గల్లంతయ్యాయని.. నకిలీ ఓట్లు వచ్చి ఓటర్ల జాబితాలో చేరాయంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పలు ఆరోపణలు గుప్పించారు. అంతేకాకుండా.. కేంద్ర ఎన్నికల సంఘంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఆ క్రమంలో బిహార్‌లో ఓట్ అధికార్ యాత్రను చేపట్టారు. ఆగస్టు 17వ తేదీన సాసారంలో రాహుల్ ఈ యాత్రను ప్రారంభించారు. 16 రోజుల పాటు వివిధ జిల్లా ద్వారా ఈ యాత్ర సాగుతోంది. సెప్టెంబర్ 1వ తేదీన బిహార్ రాజధాని పాట్నాలో ఈ యాత్ర ముగియనుంది. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు.అయితే ఎంపీ రాహుల్ గాంధీకి మద్దతుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిహార్‌లో పర్యటించడంపై జన సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ స్పందించారు. ఇంతకీ రేవంత్ రెడ్డి ఎవరని ఆయన ప్రశ్నించారు. బిహార్ రాష్ట్రంతో ఆయన ఏం పని అంటూ రేవంత్ రెడ్డిని నిలదీశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కొండ చరియలు విరిగిపడి.. 30 మంది మృతి
భారీ వర్షాలు.. సీఎం కీలక ఆదేశాలు
For National News And Telugu News