Minister: నో డౌట్.. ఈసారి గతం కంటే ఎక్కువ సీట్లు గెలుస్తాం..
ABN , Publish Date - Jun 18 , 2025 | 12:00 PM
గత అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి గెలిచిన సీట్ల కంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని మంత్రి కేఎన్ నెహ్రూ ధీమా వ్యక్తం చేశారు. అలాగే.. రాష్ట్రంలో తుపాకి సంస్కృతి పెరిగిందని ప్రతిపక్ష నేత పళనిస్వామి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
- మంత్రి కేఎన్ నెహ్రూ ధీమా
చెన్నై: గత అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి గెలిచిన సీట్ల కంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని మంత్రి కేఎన్ నెహ్రూ(Minister KN Nehru) ధీమా వ్యక్తం చేశారు. తిరునల్వేలిలో 14 మార్గాల్లో 14 మినీ బస్సులను మంత్రులు కేఎన్ నెహ్రూ, అనితా రాధాకృష్ణన్ జెండా ఊపి ప్రారంభంచారు. అసెంబ్లీ స్పీకర్ అప్పావు(Assembly Speaker Appau) అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమం అనంతరం మంత్రి నెహ్రూ మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో తుపాకి సంస్కృతి పెరిగిందని ప్రతిపక్ష నేత పళనిస్వామి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

అన్నాడీఎంకే ప్రభుత్వంలో తూత్తుకుడిలో కాల్పులు ఎలా జరిగాయని రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో, తమ ఉనికి కాపాడుకొనేలా కొందరు నాయకులు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధిక స్థానాలు సాధించి, మళ్లీ ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రిగా అధికారం చేపడతారని మంత్రి నెహ్రూ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి.
ఇంజనీరింగ్‌లో మళ్లీ ‘నచ్చిన సబ్జెక్టులు’!
సౌర విద్యుత్‌పై అవగాహన పెంచాలి
Read Latest Telangana News and National News