Share News

Fire Incident: ఈడీ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం

ABN , Publish Date - Apr 27 , 2025 | 09:49 AM

ముంబై బల్లార్డ్ పీర్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయ భవనంలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. తెల్లవారు జామున 2:30 గంటల ప్రాంతంలో సంభవించిన ఈ మంటలు తక్కువ సమయంలోనే మరింత విస్తరించాయి.

 Fire Incident: ఈడీ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం
Frre Accident in Mujbay at ED Office

మహారాష్ట్ర: ముంబై (Mumbai)లోని బల్లార్డ్ పీర్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఈడీ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం (Fire Incident) జరిగింది. అదివారం (Sunday) తెల్లవారు జామున 2.30 గంటల సమయంలో (Early Morning) అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. పలు ఫైల్స్ దగ్ధమైనట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి అగ్ని ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.

Also Read..: హైదరాబాదులో హెచ్ఐసీసీలో భారత్ సమీట్..


ఆ భవనంలోని నాలుగో అంతస్తులో అగ్ని ప్రమాదం సంభవించడంతో మంటలను అదుపు చేయడం అగ్నిమాపక సిబ్బందికి కొంచెం కష్టంగా మారింది. అయినా సిబ్బంది త్వరిత గతిన స్పందించడంతో ఐదు అంతస్తుల భవనంలోని నాల్గవ అంతస్తుకే మంటలు పరిమితమయ్యాయని అధికారులు తెలిపారు. మంటలు అదుపులోకి తెచ్చేందుకు ఎనిమిది అగ్నిమాపక యంత్రాలు, ఆరు జంబో ట్యాంకర్లు, ఒక వైమానిక నీటి టవర్ టెండర్, ఒక బ్రీతింగ్ ఉపకరణ వ్యాన్, ఒక రెస్క్యూ వ్యాన్, ఒక క్విక్ రెస్పాన్స్ వెహికల్, 108 సర్వీస్ నుండి అంబులెన్స్ సంఘటనా స్థలానికి చేరుకున్నాయని అధికారి తెలిపారు. కాగా అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏఎంసీలో శతాబ్ది భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

నేను భారత్‌ కోడలిని.. ఇక్కడే ఉంటా

For More AP News and Telugu News

Updated Date - Apr 27 , 2025 | 09:49 AM