Seema Haider: నేను భారత్ కోడలిని.. ఇక్కడే ఉంటా
ABN , Publish Date - Apr 27 , 2025 | 01:34 AM
సీమా హైదర్, పాకిస్థాన్‌కు చెందిన వివాహిత, భారత్‌లో తన భర్త సచిన్‌తో ఉన్నదీ, తన నలుగురు పిల్లలతో పాటు రెండేళ్ల క్రితం అక్రమంగా భారత్‌లో ప్రవేశించింది. పహల్గాం ఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పాక్ జాతీయులను దేశం విడిచిపోవాలని ఆదేశించిన నేపథ్యంలో, ఆమె పాకిస్థాన్‌కు తిరిగి వెళ్లాలని భావించడం లేదు, భారత్‌లోనే జీవించాలనుకుంటోంది.

మోదీ, యోగికి సీమా హైదర్ విజ్ఞప్తి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: సీమా హైదర్ గుర్తుందా? పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌కు చెందిన ఈ వివాహిత, నోయిడాకు చెందిన సచిన్‌తో ప్రేమలో పడి.. తన నలుగురు చిన్నారులను వెంటబెట్టుకొని రెండేళ్ల క్రితం నేపాల్ మీదుగా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించింది. అప్పట్లోనే సచిన్ మీనాను పెళ్లి చేసుకొని, అతడితో పాటే ఉంటోంది. పహల్గాం ఘటన నేపథ్యంలో పాకిస్థాన్ జాతీయులు దేశం వీడి వెళ్లాలంటూ కేంద్రం హుకుం జారీ చేయడంతో సీమా హైదర్ ఆందోళనలో పడింది. తాను సచిన్ మీనాను పెళ్లి చేసుకున్నాక హిందూమతం స్వీకరించానని.. ఇప్పుడు తాను హిందువునని అంటోంది. తాను పాక్ బిడ్డనే అయినా ఇప్పుడు భారత్ కోడలినంటోంది. తనను పాక్‌కు పంపించొద్దని ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగికి విజ్ఞప్తి చేసింది.
ఇవి కూడా చదవండి:
పెళ్లై సంవత్సరం కూడా కాలేదు.. అంతలోనే విషాదం..
Seema Haider: పాకిస్తాన్ తిరిగి వెళ్లటంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీమా హైదర్