Share News

Mallojula Venugopal Rao: మావోయిస్టు అగ్రనేత లొంగుబాటు

ABN , Publish Date - Oct 14 , 2025 | 11:18 AM

మహారాష్ట్రలో మావోయిస్టు నేత మల్లోజుల వేణుగోపాల్‌రావు పోలీసుల ఎదుట లొంగిపోయారు. 60 మందితో కలిసి గడ్చిరోలి పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇటీవల మల్లోజుల లేఖ విడుద చేసిన విషయం తెలిసిందే.

Mallojula Venugopal Rao: మావోయిస్టు అగ్రనేత లొంగుబాటు
Mallojula Venugopal Rao

మహారాష్ట్రలో సీపీఐ (మావోయిస్ట్) పొలిట్ బ్యూరో మెంబర్ మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ అభయ్ అలియాస్ సోను పోలీసుల ఎదుట లొంగిపోయారు. 60 మందితో కలిసి గడ్చిరోలి పోలీసుల ఎదుట ఆయుధాలు వదిలిపెట్టి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. మావోయిస్టు పార్టీ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇటీవల మల్లోజుల లేఖ విడుద చేసిన విషయం తెలిసిందే.


మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపట్టిన 'ఆపరేషన్ కగార్' నిర్విరామంగా కొనసాగుతుంది. పోలీసులు అడవుల్లోకి చొచ్చుకెళ్లి మరీ మావోయిస్టులను హతమార్చుతున్నారు. అడవుల్లో దాక్కున్న మావోయిస్టులను భద్రతాదళాలు ఎన్‌కౌంటర్ చేస్తున్నాయి. వరుస ఎన్‌కౌంటర్‌లతో వందలాదిగా మావోయిస్టులు చనిపోతున్నారు. ఈ క్రమంలోనే మావోయిస్టు నేత మల్లోజుల వేణుగోపాల్ రావు.. పోలీసుల ఎదుట సరెండర్ అయ్యారు. ఇకపై ఆయుధాలు పట్టనని, జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నట్లు చెప్పారు. అయితే అడవిలో ఉన్నప్పుడు మల్లోజుల వేణుగోపాల్ ఆయుధాలు వదిలి పెట్టేందుకు సిద్ధమని ప్రతికా ప్రకటన చేశారు. ఛత్తీస్‌గఢ్‌తో సహా దేశంలోని ఇతర మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని కేడర్లు ఆయన నిర్ణయానికి మద్దతు ప్రకటించాయి. ఈ తరుణంలో ఆయన పోలీసుల ఎదుట లొంగిపోయారు.


ఈ ఏడాది సెప్టెంబరులో ఆయుధాలు వదిలేసి శాంతి చర్చలకు వెళ్లాలని మల్లోజుల విడుదల చేసిన లేఖలో కీలక విషయాలు ప్రస్తావించారు. 'ఇంతకాలం పార్టీ చేసిన తప్పులకు, ఉద్యమం ఓడిపోకుండా కాపాడలేకపోయినందుకు బాధ్యత వహిస్తూ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా క్షమాపణలు కోరుతున్నా. ఇంతటి నష్టానికి, ఇన్ని బలిదానాలకు దారితీసిన విప్లవోద్యమ బాధ్యతల్లో తాను ఎంత మాత్రం కొనసాగడానికి అర్హుడిని కాదని భావిస్తున్నా. ప్రస్తుతం పార్టీ కష్టకాలంలో ఉంది. ఈ సమయంలో నా నిర్ణయం సరైంది కాకపోవచ్చు. కానీ పరిస్థితులు దీన్ని తప్పనిసరి చేశాయి. వందల మంది మావోయిస్టులను కోల్పోతున్న పరిస్థితుల్లో పార్టీ పిడివాద, అతివాద విధానాల నుంచి మిగిలిన వారినైనా కాపాడుకోవాలి. ఉద్యమాన్ని నడిపించడానికి ప్రజల్లోకి వెళ్లడం తప్ప మరో మార్గం లేదు' అని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి:

Kashmir Infiltration: కశ్మీర్‌లో చొరబాట్లకు యత్నం.. ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా దళాలు

EPS: తేల్చేసిన మాజీసీఎం.. విజయ్‌ పార్టీతో పొత్తు

Updated Date - Oct 14 , 2025 | 11:48 AM