Share News

Encounter: ఎన్‌కౌంటర్‌లో మరో టాప్ మావోయిస్ట్ కమాండర్ హతం

ABN , Publish Date - May 27 , 2025 | 10:20 AM

దేశాన్ని మావోయిస్టుల రహితంగా మార్చేందుకు కేంద్రం ఆపరేషన్ కగార్ చేపట్టింది. అందులోభాగంగా పలు ఎన్‌కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో వరుస ఎన్‌కౌంటర్లలో వందలాది మంది మావోయిస్టులు మరణించిన సంగతి తెలిసిందే.

Encounter: ఎన్‌కౌంటర్‌లో మరో టాప్ మావోయిస్ట్ కమాండర్ హతం

రాంచీ, మే 27: జార్ఖండ్‌లో పాలం జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు పాలం రేంజ్ డీఐజీ వైఎస్ రమేశ్ మంగళవారం రాంచీలో వెల్లడించారు. మరణించిన మావోయిస్టు తులసీ బునియన్‌గా గుర్తించామన్నారు. అతడు టాప్ మావోయిస్టు కమాండర్‌గా పని చేస్తున్నారని తెలిపారు. అతడి తలపై రూ. 5 లక్షల రివార్డు ఉందని వివరించారు. ఇక గాయపడిన మావోయిస్టు నితీశ్ యాదవ్ తలపై రూ.15 లక్షల రివార్డు ఉందన్నారు.

ఈ ఎన్‌కౌంటర్ సోమవారం అర్థరాత్రి చోటు చేసుకుందని వివరించారు. మహమ్మద్‌‌గంజ్, హైదర్‌నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మావోయిస్టులు ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి భద్రతా దళాలకు సమాచారం అందిందన్నారు. దీంతో ఆ ప్రాంతానికి చేరుకున్న భద్రతా దళాలు కూంబింగ్ చేపట్టాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించిన మావోయిస్టులు.. భద్రతా దళాలపైకి కాల్పులు జరిపారన్నారు. దీంతో భద్రతా దళాలు వెంటనే అప్రమత్తమై.. ఎదురు కాల్పుల జరిపారని తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్ అనంతరం ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టి పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.


మరోవైపు.. జర్ఖండ్‌లోని లాటెహార్ జిల్లాలో సోమవారం ఉదయం ఒక ఎన్‌కౌంటర్ చోటు చేసుకుందని గుర్తు చేశారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మనీష్ యాదవ్ మరణించారని తెలిపారు. అతడి తలపై కూడా రూ. 5 లక్షల రివార్డు ఉందన్నారు. మరోవైపు ఆదివారం రాత్రి దౌనా అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు కూబింగ్‌ నిర్వహించాయని.. ఆ క్రమంలో మావోయిస్టు కుందన్ కేర్వార్‌‌ను అరెస్ట్ చేసినట్లు డీఐజీ వైఎస్ రమేష్ వివరించారు. అతడి తలపై సైతం రూ. 5 లక్షల రివార్డు ఉందన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

భోజనం మెనూ అదుర్స్.. చాలా కాలం తర్వాత..

టీడీపీ సక్సెస్‌కు టాప్ సీక్రెట్ అదే..

For National News and Telugu News

Updated Date - May 27 , 2025 | 10:37 AM