Share News

TDP Mahanadu: భోజనం మెనూ అదుర్స్.. చాలా కాలం తర్వాత..

ABN , Publish Date - May 27 , 2025 | 09:34 AM

కడప వేదికగా టీడీపీ మహానాడు ప్రారంభంకానుంది. ఈ మహానాడుకు వివిధ ప్రాంతాల్లోని తెలుగుదేశం పార్టీ అభిమానులు భారీగా తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో వారికి పసందైన విందు భోజనాలను ఏర్పాటు చేస్తున్నారు.

TDP Mahanadu: భోజనం మెనూ అదుర్స్.. చాలా కాలం తర్వాత..

కడప, మే 27: కడప వేదికగా మహానాడు మంగళవారం ప్రారంభంకానుంది. ఈ మహానాడుకు ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా.. తెలంగాణతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు వారు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఆంధ్రా, రాయలసీమ, తెలంగాణలకు చెందిన ప్రత్యేక వంటకాలను రుచి చూపించనున్నారు. ఇక చాలాకాలం అనంతరం మహానాడులో మాంసాహారం సైతం వడ్డించనున్నారు.

మొదటి రెండు రోజులు రెండు లక్షల మందికిపైగా ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్‌ అందించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. అలాగే మహానాడు బహిరంగ సభ ముగింపు రోజు.. అంటే గురువారం బహిరంగ సభకు భారీగా కార్యకర్తలు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో మహానాడు ప్రాంగణంలో రెండు లక్షల మందికి ఆహారం అందిస్తూనే.. బయట నలుదిక్కులా ఫుడ్‌ కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. వాటిలో సుమారు మూడు లక్షల మందికి భోజనాలు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.


ప్రతిరోజూ భోజనాల్లో 20 రకాల వంటకాలకు తగ్గకుండా ఈ మహానాడుకు హాజరయ్యే వారికి వడ్డించనున్నారు. సుమారు 1,700 మంది వంటవారు.. మరో 800 మందిని వడ్డింపునకు నియోగించనున్నారు. ఇక స్వీట్స్‌లో.. తాపేశ్వరం కాజా, అల్లూరయ్య మైసూర్‌పాక్, చక్కెర పొంగలి, ఫ్రూట్‌ హల్వా తదితర మిఠాయిలు సిద్ధం చేస్తున్నారు. 50 వేల కొడిగుడ్లు వడ్డించనున్నారు. మరోవైపు మహానాడు ఆవరణలోని వంటశాలను పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే సందర్శించి.. భోజన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వంట వారికి పలు కీలక సూచనలు సైతం చేశారు.


మెనూ ఇలా ఉండనుంది..

ఉదయం అల్పాహరం

టూటీ ఫ్రూటీ కేసరి, పొంగలి, ఇడ్లీ, టమాటా బాత్, కాఫీ, టీ

మధ్యాహ్న భోజనం

మాంసాహారంలో గోంగూర చికెన్, ఆంధ్రా స్టైల్‌ చికెన్‌కర్రీ, ఎగ్‌ రోస్ట్, రోటి పచ్చడి, వైట్ రైస్, ప్లెయిన్‌ బిర్యానీ, సాంబారు, ఉలవచారు, మామిడికాయ పచ్చడి, పెరుగు వడ్డించనున్నారు.

ఇక శాఖాహారంలో గోంగూర పూల్‌ మఖానా, ప్లెయిన్‌ బిర్యానీ, టమాటా పప్పు, వైట్ రైస్, రోటి పచ్చడి, పెరుగు, చిప్స్, ములక్కాయ టమాటా గ్రేవీ, బెండకాయ బూందీ వడ్డించనున్నారు.

సాయంత్రం స్నాక్స్‌

కాఫీ, టీతో పాటు కార్న్‌ సమోసా, బిస్కెట్లు, పకోడీ, మిర్చి బజ్జీలు అందజేయనున్నారు.

రాత్రి భోజనం

రైస్‌తోపాటు వంకాయ బఠాణీ, ఆలూ ఫ్రై, పెసరపప్పు చారు, రోటి పచ్చడి, పెరుగు వడ్డించనున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

టీడీపీ సక్సెస్‌కు టాప్ సీక్రెట్ అదే..

తొలి రోజు 23 వేల మంది ప్రతినిధులతో మహానాడు

For AndhraPradesh News and Telugu News

Updated Date - May 27 , 2025 | 11:26 AM