Maoist Modem Balakrishna: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. కేంద్ర కమిటీ సభ్యుడు మోదెం బాలకృష్ణ మృతి
ABN , Publish Date - Sep 11 , 2025 | 07:05 PM
ఛత్తీస్‌గఢ్‌లో తాజాగా భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మనోజ్ అలియాస్ మోదెం బాలకృష్ణ మృతి చెందారు. ఆయనతోపాటు మరికొంతమంది కీలక నేతలు హతమయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్ (Chhattisgarh Maoist encounter) జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, వరంగల్ జిల్లాకు చెందిన మనోజ్ అలియాస్ మోదెం బాలకృష్ణ సహా మెుత్తం 10 మంది మృతిచెందారు. మనోజ్ పై గతంలో రూ.2 కోట్ల రివార్డు ప్రకటించారు. అలాగే ఒడిశా స్టేట్ మావోయిస్టు పార్టీ కార్యదర్శిగా పనిచేస్తున్న ప్రమోద్ యారఫ్ పాండు సైతం హతమైనట్లు తెలుస్తోంది.
గరియాబంద్ జిల్లాలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌తో మావోలకు పెద్ద ఎదురుదెబ్బే తగిలినట్లు అయ్యింది. ప్రస్తుతం అక్కడ ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు(Modem Balakrishna encounter). ఎదురుకాల్పులు ముగిసిన తరువాతే మృతులపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్‌లో బయటపడ్డ ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్.. రూ.1000 కోట్ల దోపిడీ
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల గొంతుకోసింది.. కేటీఆర్ ఫైర్
For More TG News And Telugu News