Pension Fraud: భార్యను రికార్డుల్లో చంపేసిన భర్త
ABN , Publish Date - Aug 04 , 2025 | 04:26 AM
తాను చనిపోతే భార్యకు వితంతు పింఛను రాకూడదన్న ఉద్దేశంతో ఓ వ్యక్తి ఆమెను రికార్డుల్లో చంపేశాడు.
తాను పోయాక వితంతు పింఛన్ అందకూడదనే
పట్నా, ఆగస్టు 3: తాను చనిపోతే భార్యకు వితంతు పింఛను రాకూడదన్న ఉద్దేశంతో ఓ వ్యక్తి ఆమెను రికార్డుల్లో చంపేశాడు. బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ సమయంలో ఈ విషయం బయటపడింది. ఓటర్ల జాబితా సవరణ కోసం అధికారులు పట్నా రూరల్ నియోజకవర్గం ధనరువా గ్రామంలోని శివరంజన్ కుమార్ ఇంటికి వెళ్లగా అక్కడ ఆయన భార్య నిషా కుమారి కనిపించింది. కానీ, 3 నెలల క్రితం చనిపోయినట్టు ప్రభుత్వ రికార్డుల్లో ఉంది. డెత్ సర్టిఫికెట్ కూడా జారీ అయింది. అధికారులు ఈ విషయమే ఆమెతో చెప్పారు. దీంతో, తన డెత్ సర్టిఫికెట్ కోసం ఎవరు దరఖాస్తు చేశారో వివరాలు వెల్లడించాలంటూ నిషా కుమారి బీడీఓకు అప్లికేషన్ సమర్పించారు. భర్త శివరంజన్ కుమారే అలా చేశాడని తేలింది. ఎందుకని ప్రశ్నిస్తే.. ‘‘నా భార్యకు నాకు పడట్లేదు. నేను చనిపోతే పెన్షన్ రావొద్దనే అలా చేశాను’’ అని శివరంజన్ సమాధానం ఇచ్చాడు.
చివరి సి-295 భారత్‌కు చేరింది.. అప్పగింతలు పూర్తి చేసిన స్పెయిన్
తేజస్వి యాదవ్‌కు ఎన్నికల కమిషన్ నోటీసు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి