Share News

Woman Doctor Suicide Case: మహిళా డాక్టర్ ఆత్మహత్య కేసులో కొత్త విషయాలు.. సూసైడ్‌కు ముందు చాటింగ్

ABN , Publish Date - Oct 28 , 2025 | 05:01 PM

మహారాష్ట్ర సతారా జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న మహిళా డాక్టర్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వైద్యురాలి ఆత్మహత్య కేసును కొలిక్కి తీసుకొచ్చేందుకు పోలీసులకు కీలకమైన ఆధారాలు లభించాయి.

Woman Doctor Suicide Case: మహిళా డాక్టర్ ఆత్మహత్య కేసులో కొత్త విషయాలు.. సూసైడ్‌కు ముందు చాటింగ్
Woman Doctor Suicide Case

ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 28: మహారాష్ట్ర సతారా జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న మహిళా డాక్టర్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వైద్యురాలి ఆత్మహత్య కేసును కొలిక్కి తీసుకొచ్చేందుకు పోలీసులకు కీలకమైన ఆధారాలు లభించాయి. ఎస్సై గోపాల్‌ బదానే తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ అరచేతిపై సూసైడ్‌ నోట్‌ రాసి ఆమె ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు సూసైడ్ నోట్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు మరికొన్ని ఆధారాలు దొరికాయి.


డాక్టర్ ఆత్మహత్యకు కారణమని భావిస్తున్న ప్రశాంత్ బంకర్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌తో ఆమె చాటింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. డాక్టర్ సూసైడ్ చేసుకోవడానికి ముందు మానసికంగా చాలా కుంగిపోయి ఉంటుందని భావిస్తున్నారు. ఇటీవల సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రశాంత్ బంకర్ ఇంట్లో మహిళా డాక్టర్ పూజ కార్యక్రమానికి హాజరైందని.. కానీ అక్కడ గొడవ జరిగిన తర్వాత ఆమె అక్కడి నుంచి హోటల్‌కు వెళ్లిందని పోలీసులు తెలిపారు. తీవ్ర మనోవేదనతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని పేర్కొన్నారు. కాగా, సతారా పోలీసు విభాగానికి చెందిన ఎస్సై గోపాల్‌ బదానే పలుమార్లు తనపై లైంగిక దాడి చేశాడని ఇప్పటికే ఆమె సూసైడ్ నోట్ లో తెలిపింది. మరో వ్యక్తి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రశాంత్‌ బంకర్‌ మానసికంగా వేధింపులకు గురిచేశాడని ఆరోపించింది. దర్యాప్తులో భాగంగా పోలీసులు వీరిద్దరినీ అరెస్ట్ చేయగా.. కేసు విచారణ కొనసాగుతోంది.


మహారాష్ట్ర మహిళా సంఘం చైర్‌పర్సన్ రూపాలి చకాంకర్ మాట్లాడుతూ.. బంకర్ ఇంట్లో వైద్యురాలు లక్ష్మీ పూజకు హాజరై, అక్క‌డ ఫోటోలు తీసుకునే విషయంలో గొడవలు జరిగాయని తెలిపారు. తర్వాత డాక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోయిందని.. బంకర్ తండ్రి ఆమెను తిరిగి తీసుకురాగానే, ఆమె మరోసారి హోటల్‌కు వెళ్లిపోయిందని చెప్పారు. ఇదే విషయాన్ని పోలీసు అధికారి తుషార్ దోషి కూడా ధృవీకరించారు.


ఇవి కూడా చదవండి:

ECI: ప్రశాంత్ కిషోర్‌కు ఎన్నికల కమిషన్ నోటీసు

Mentha Cyclone: మొంథా తుపాన్‌పై ఆరా.. రైల్వే మంత్రి కీలక ఆదేశాలు

Updated Date - Oct 28 , 2025 | 07:34 PM