Share News

Mahakumbh Fire: మహాకుంభమేళా ప్రమాదస్థలికి యోగి

ABN , Publish Date - Jan 19 , 2025 | 06:18 PM

గీతాప్రెస్‌కు చెందిన సెక్టార్ 19లో ఆదివారం మధ్యాహ్నం 4.30 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు సమీపంలోని 10 టెంట్లకు పాకడంతో పోలీసులు, స్థానిక యంత్రాంగం అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసినట్టు ప్రయాగ్‌రాజ్ జిల్లా మెజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ తెలిపారు.

Mahakumbh Fire: మహాకుంభమేళా ప్రమాదస్థలికి యోగి

ప్రయాగ్‌రాజ్: మహాకుంభమేళా (Mahakumbh) లో భారీ అగ్నిప్రమాదం జరగడంతో ప్రమాదస్థలికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) హుటాహుటిన చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. గీతాప్రెస్‌కు చెందిన సెక్టార్ 19లో ఆదివారం మధ్యాహ్నం 4.30 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు సమీపంలోని 10 టెంట్లకు పాకడంతో పోలీసులు, స్థానిక యంత్రాంగం అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసినట్టు ప్రయాగ్‌రాజ్ జిల్లా మెజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ తెలిపారు. ప్రమాదంలో గాయపడినట్టు సమాచారం లేదని తెలిపారు.

Maha Kumba Mela 2025 : బ్రేకింగ్ న్యూస్.. కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం..


సెక్టార్ 19లో రెండు, మూడు సిలిండెర్లు పేలడంతో క్యాంప్‌లో పెద్దఎత్తున మంటలు చెలరేగినట్టు ఏడీజీ భాను భాస్కర్ చెప్పారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడినట్టు సమాచారం లేదని, అందరూ సురక్షితంగా ఉన్నారని చెప్పారు. ఘటనపై విచారణ జరుపుతున్నట్టు తెలిపారు.


విచారకరం..

మహాకుంభమేళాలో అగ్నిప్రమాద ఘటనపై మహాకుంభ్ 2025 అధికారిక "ఎక్స్''లో విచారం వ్యక్తం చేసింది. ఈ ఘటన అందరికీ దిగ్భ్రాంతి కలిగించిందని, అధికార యంత్రాంగం వెంటనే సహాయక కార్యక్రమాలు చేపట్టిందని తెలిపింది. మహాకుంభ్‌కు హాజరైన భక్తులను గంగామాత చల్లగా కాపాడాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపింది. జనవరి 13వ తేదీ పుష్యమాస పౌర్ణమిన 45 రోజుల మహాకుంభ మేళా ప్రారంభమైంది. ఇంతవరకూ 7.72 కోట్ల మంది భక్తులు త్రివేణిసంగమంలో పవిత్ర స్నానాలు చేశారు. 40 కోట్ల మందికి పైగా దేశ, విదేశీయులు ఈ మహోత్సవంలో పాల్గొంటారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది.


ఇవి కూడా చదవండి..

Saif Ali Khan: సినిమాలను మించే ట్విస్ట్.. సైఫ్ కేసులో నిందితుడ్ని ఎలా పట్టుకున్నారంటే..

Saif Ali Khan:ఆ పని కోసం సైఫ్ ఇంటికి వెళ్లి.. ఇంతలోనే..

Read Latest National News and Telugu News

Updated Date - Jan 19 , 2025 | 06:18 PM