Share News

High Court: రాష్ట్రంలో.. పెరుగుతున్న పరువు హత్యలు

ABN , Publish Date - Aug 05 , 2025 | 11:42 AM

రాష్ట్రంలో పరువు హత్యలు పెరుగుతన్నాయని మద్రాస్‌ హైకోర్టు పేర్కొంది. కడలూరులో మృతిచెందిన కళాశాల విద్యార్థి జయసూర్య తండ్రి ఎం.మురుగన్‌ హైకోర్టు దాఖలు చేసిన పిటిషన్‌లో తన కుమారుడి మృతిపట్ల అనుమానం వ్యక్తం చేశారు.

High Court: రాష్ట్రంలో.. పెరుగుతున్న పరువు హత్యలు

- మద్రాస్‌ హైకోర్టు

చెన్నై: రాష్ట్రంలో పరువు హత్యలు పెరుగుతన్నాయని మద్రాస్‌ హైకోర్టు(Madras High Court) పేర్కొంది. కడలూరులో మృతిచెందిన కళాశాల విద్యార్థి జయసూర్య తండ్రి ఎం.మురుగన్‌ హైకోర్టు దాఖలు చేసిన పిటిషన్‌లో తన కుమారుడి మృతిపట్ల అనుమానం వ్యక్తం చేశారు. తన కుమారుడు ప్రమాదంలో మరణించినట్లు చిత్రీకరించారని, తాము దీనిని పరువు హత్యగా అనుమానిస్తున్నామని, అందువల్ల ఈ కేసు విచారణ మరో దర్యాప్తు సంస్థకు బదిలీ చేయాలని న్యాయస్థానాన్ని కోరారు.


nani4.2.jpg

తమ కుమారుడు ఇతర వర్గానికి చెందిన విద్యార్థినిని ప్రేమించినందువల్ల ఆమె బంధువులు తరచూ మమ్మల్ని బెదిరిస్తున్నారని, తమకు పోలీసుల భద్రత కల్పించేలా ఉత్తర్వులు జారీచేయాలని పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌ సోమవారం హైకోర్టు ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. అప్పుడు రాష్ట్రంలో పరువు హత్యలు పెరుగుతుండడంపై ఆవేదన వ్యక్తంచేసిన హైకోర్టు ధర్మాసనం ఈ పరువు హత్యలకు సంబంధించిన వాస్తవాలు వెలుగులోకి రావడం లేదని, న్యాయమూర్తి వేల్‌మురుగన్‌ ఆవేదన వ్యక్తంచేశారు. పిటిషనర్‌ కోరిక మేరకు జయసూర్య మృతి కేసు విచారణను సీబీసీఐడీకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఇది రాజకీయం కాదు.. బీసీల ఆత్మగౌరవ పోరాటం!

బొగత జలపాతం వద్ద పర్యాటకుల సందడి

Read Latest Telangana News and National News

Updated Date - Aug 05 , 2025 | 11:42 AM